ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె చేసిన మంచి పనికి అందరూ హ్యాట్సాఫ్ చెప్తూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
పోలీస్ అనగానే అదో రకమైన అలజడి రేగుతది గుండెల్లో. దీనికి గల కారణం నేరాలను అదుపు చేసే క్రమంలో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించడమే. మరికొందరు దురుసుగా ప్రవర్తించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తారు. కానీ అందరు పోలీసులు అలా ఉంటారనుకుంటే పొరపాటే. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తూ కీలకంగా వ్యవహరిస్తారు పోలీసులు. ఆపదలో ఉన్నవారిని ఆదుకూంటూ మానవత్వాన్ని చాటుకుంటుంటారు. ఇదే క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ పసి పాపను లాలిస్తూ మంచి మనసును చాటుకున్నది. దీనికి సంబంధించిన విషయాన్ని పోలీస్ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది. గొప్ప పని చేశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఓ మహిళా తన ఆరు నెలల వయసున్న కొడుకుతో పరీక్షరాయడానికి వచ్చింది. ఇంకాసేపట్లో పరీక్ష ప్రారంభం అవుతదనంగా బాబు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆ మహిళా బిడ్డ ఏడుస్తుండగా పరీక్ష ఎలా రాసేదంటూ ఆందోళనకు గురయ్యింది. ఎగ్జామ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఈ పరిస్థితిని అంతా గమనించి ఆ మహిళ వద్దకు వచ్చి చిన్నారిని తన దగ్గరకు తీసుకుని మీరు ధైర్యంగా పరీక్ష రాయండి బిడ్డను నేను లాలిస్తానంటూ ఆమెకు ధైర్యం చెప్పింది. ఆ మహిళా కానిస్టేబుల్ చిన్నారిని ఆడిస్తున్న ఫొటోలను అహ్మదాబాద్ పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
అహ్మదాబాద్ లోని ఓధవ్ లో గుజరాత్ హైకోర్ట్ ప్యూన్ రిక్రూట్ మెంట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు పసిబిడ్డతో ఓ మహిళ హాజరయ్యింది. ఆమె పరీక్ష రాసే సమయంలో చిన్నారిని లాలిస్తూ మానవత్వాన్ని చాటుకుంది కానిస్టేబుల్ దయాబెన్. ఏడుస్తున్న చిన్నారిని ఆడిస్తూ తల్లి పరీక్ష రాయడానికి సహాయం చేసింది. మహిళా కానిస్టేబుల్ దయాబెన్ చేసిన పనికి పోలీస్ అధికారులు అభినందించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. మహిళా కానిస్టేబుల్ దయాబెన్ గ్రేట్ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહીલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાથી નું પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે તે સારું મહિલા પોલીસ કર્મચારી દયાબેન નાઓએ માનવીય અભિગમ દાખવી બાળકને સાચવેલ જેથી માનવીય અભિગમ દાખવવામાંઆવેલ છે pic.twitter.com/SIffnOhfQM
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 9, 2023
Dayaben has become a symbol of the sensitive side of #Gujarat Police. Happy to hand over a letter of appreciation to her.@CMOGuj @sanghaviharsh @GujaratPolice https://t.co/0PcLPRu4Ot pic.twitter.com/WU9ODVTwxL
— DGP Gujarat (@dgpgujarat) July 10, 2023