కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ మరువకముందే ఒడిశాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు బర్గఢ్ నుంచి దుంగ్రీ వెళ్తుండగా ఒక్కసారిగా పట్టాలు తప్పింది.
ఒడిశాలోని రైలు ప్రమాద ఘటనలో ఇప్పటికీ 280 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పాటు 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే చరిత్రలో ఇంతటి ఘోర రైలు ప్రమాద ఘటన ఎప్పుడూ జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇండియాలోని రాజకీయ, సినీ ప్రముఖులే కాకుండా యావత్ ప్రపంచ దేశాధినేతలు సైతం స్పందించారు. అయితే ఈ కోరమండల్ రైలు ప్రమాద ఘటన మరువకముందే తాజాగా ఒడిశాలో మరో రైలు పట్టాలు తప్పింది.
విషయం ఏంటంటే? ఒడిశాలోని ఓ గూడ్స్ రైలు సోమవారం సున్నపు లోడుతో బర్గఢ్ నుంచి దుంగ్రీ బయలు దేరింది. ఈ రైలు సంబర్ ధార వద్దకు రాగానే ఉన్నట్టుండి పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలు కిందపడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కోరమండల్ రైలు ప్రమాద ఘటన మరువకముందే మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో స్థానిక ప్రజలు భయందోళనలకు గురయ్యారు. రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.