ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కనీ వినీ ఎరుగని వింతలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. ప్రపంచంలో జరిగిన ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు సోషల్ మీడియాలో చూడగలుగుతున్నాం. విమానాలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఆకాశ మార్గాన వెళ్లే ఓ విమానం రోడ్డు మార్గాన వెళ్తుంటే.. అందరూ వింతగా చూడటం మొదలు పెట్టారు. ఒక ట్రక్కు పై భారీగా ఉన్న విమానం రోడ్డు మార్గాన వెళ్లడంతో వాహనదారులు.. జనాలు చూడటానికి ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఒక భారీ ట్రక్కులో త్రివేండ్రం నుంచి హైదరాబాద్ కి రోడ్డు మార్గాన బయలుదేరింది. ఇలా రోడ్డు పై భారీ విమానాన్ని జనాలు ఎప్పుడూ చూడకపోవడంతో వింతైన అనుభూది చెందుతున్నారు. రోడ్డుపై పయణిస్తున్న వాహనదారులు.. జనాలు తమ సెల్ ఫోన్లలో విమానానికి సంబంధించిన దృష్యాన్ని వీడియోలు.. ఫోటోలు తీస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ ఏ 320 విమానాన్ని ఒక ట్రక్కు పై తరలిస్తున్న దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఎయిర్ బస్ ని సర్వీస్ నుంచి ఎప్పుడో తొలగించారు. ఈ విమానం స్క్రాప్ కి తప్ప దేనికీ ఉపయోగపడదు.
ఈ నేపథ్యంలోనే కేరళాలోని త్రివేండ్రంలో జరుగుతున్న వేలం గురించి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ రెస్టారెంట్ ఓనర్ దీన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కేరళా నుంచి హైదరాబాద్ కి ఒక పెద్దట్రక్ లో దీన్ని తీసుకు వస్తున్నారు. తన రెస్టారెంట్ అభివృద్ది కోసం ఓ వినూత్న ప్రయోగం చేయబోతున్నట్టుగా.. ఆ విమానాన్ని ఒక అందమైన రెస్టారెంట్ గా తీర్చిదిద్దే ప్లాన్ లో ఉన్నట్లు రెస్టారెంట్ ఓనర్ తెలిపారు.
ఇప్పటికే హైదరాబాద్ లో రక రకాల థీమ్స్ లో రెస్టారెంట్లు దర్శనమిస్తుంటాయి.. మరి ఈ విమానం రెస్టారెంట్ ఎలా ఆకర్షిస్తుందో చూడాలి. ఈ విమానం లో కొన్ని బాగాలు సపరేట్ చేసి రవాణా చేస్తున్నారట. హైదరబాద్ కి చేరుకోవడానికి కనీసం ఒక నెలరోజులు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.