ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్ లో జరిగిన వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లుతుంది. అధికార, ప్రతిపక్షా నేతల మద్య వాడీ వేడిగా మాటలు నడుస్తున్నాయి.
సాధారణంగా రోడ్డు పై వెళ్తున్న సమయంలో కానీ.. మేడపై నిల్చున్న సమయంలో కాకులు హఠాత్తుగా వచ్చి తలపై తన్నిపోతుంటాయి. అలా తలపై కాకి తన్నిపోతే అరిష్టం అని కొంతమంది అంటుంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఇటీవల మణిపూర్ లో జరిగిన సంఘటనలపై అధికార, ప్రతిపక్ష నేతలపై మాటల యుద్దం కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో పార్లమెంట్ ఆవరణలో ఓ హాస్య సన్నివేశం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్ద పార్లమెంట్ బయట ఫోన్ లో మాట్లాడుతు నడుస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ కాకి ఆయన తలపై తన్నడంతో వెంటనే ఆయన తలని కిందకు దింపుకుంటూ వెళ్లాడు. ఈ అనూహ్య పరిణామానికి ఎంపీ చద్దా కాస్త కంగారుపడ్డారు. అయితే దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఓ కాకి ఆయన తలపై తన్నుకుంటూ వెళ్లింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి చద్ద ఆశ్చర్యపోయారు.. వెంటనే తల దింపుకుంటూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఢిల్లీ భాజాపా విభాగం ట్విట్ లో పోస్ట్ చేస్తూ.. హిందీలో ఉన్న పాత సామెతను గుర్తు చేస్తూ వ్యంగంగా కామెంట్ చేసింది. ‘ఝూట్ బోలే.. కవ్వా కాటే’అని క్యాప్షన్ పెట్టింది. అంటే అబద్దాలు చెబితే కాని తన్నిపోతుంది అని దాని అర్థం. ఈ సామెత విన్నాం.. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. మొదట్లో వీరిద్దరూ స్నేహితులనే భావించినప్పటికీ పలు మార్లు ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్టుల్లో జంటగా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అభిమానులు ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు.. అక్టోబర్ నెలాఖరులో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వారి సన్నిహితులు చెబుతున్నప్పటికీ అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు పరిణితి చోప్రాకు కూడా ట్యాగ్ చేసినట్లు తెలుస్తుంది.
झूठ बोले कौवा काटे 👇
आज तक सिर्फ सुना था, आज देख भी लिया कौवे ने झूठे को काटा ! pic.twitter.com/W5pPc3Ouab
— BJP Delhi (@BJP4Delhi) July 26, 2023