బుధవారం దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అంతేకాక దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ జైత్రయాత్రకు ఆప్ బ్రేకులు వేసింది. మొత్తం 250 స్థానాలు ఉన్నఎంసీడీ లో 134 స్థానాల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మెజారీటి 126 కాగా .. అంతకంటే ఎక్కువ స్థానాలు ఆప్ పార్టీ సాధించింది. ఇక మరోవైపు బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించింది. ఢిల్లీలో ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కేవలం 09 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. తాజాగా వెలువడి ఈ ఎన్నికల ఫలితాలతో ఆప్ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ విజయం సాధించడంపై పంజాబ్ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం కౌంటిగ్ మొదలైన నుంచి బీజేపీ మెజార్టీ స్థానాలో ఆధిక్యంలో కొనసాగింది. మొత్తం 250 స్థానాలకు గానూ 104స్థానాల్లో ముందజలో ఉంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 100 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ముందంజలో ఉంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని దూసుకెళ్తు కనిపించింది. ఈక్రమంలో అందరిలో ఓ రకమైన ఆసక్తి నెలకొంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ విజయం సాధిస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 250 వార్డులకు డిసెంబర్ 4న పోలీంగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1349 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు.
1958లో మొదటి సారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. అయితే 2012లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఈ కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించారు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో 2022లో వాటిని విలీనం చేసి పూర్వ ఎంసీడీగా పునరుద్దరించారు. మే 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఇలా ఏర్పడిన తరువాత ఇవే మొదటి ఎన్నికలు. చివరగా 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు గెలుపొందింది. అలానే ఆప్ 48, కాంగ్రెస్ 27 స్థానాలు గెలుచుకున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో గత 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. 15 ఏళ్ల బీజేపీ జైత్రయాత్రకు తాజా ఎన్నికల్లో ఆప్ బ్రేకులు వేసింది.