కొందరు వ్యక్తులు ఊహించని విజయాలు సాధించినప్పుడు అతని స్నేహితులు అంతా కలిసి గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. వాళ్లు సాధించిన విజయం అందరికి తెలిసేలా రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలియజేస్తుంటారు. అయితే కేరళలోని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలో పాస్ అయినందుకు డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ బాలుడి ఆలోచన తీరుకు ఏకంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించి అభినందించాడు. అసలు ఆ బాలుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడనే కదా మీ ప్రశ్న?
కేరళ రాష్ట్రానికి చెందిన జిష్ణు అనే విద్యార్థి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అయితే పరీక్ష ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని తీవ్రంగా ఎదురుచూశాడు. ఫలితాలు కూడా రానే వచ్చాయి. అయితే తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిష్ణు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇక తన విజయాన్ని అందరిలా కాకుండా కాస్త కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ విద్యార్థి తనకు తాను ఫోటో పెట్టుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Newly Married Women: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్ లో వెతికేది ఇదేనట!
ఫోటోతో పాటు.. కొందరు వస్తే చరిత్ర మారిపోతుంది. నేను కూడా ఆ కోవకే చెందుతాను. ఇలాగే జీవితం పెట్టే పరీక్షలో కూడా విజయం సాధిస్తానంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఏర్పాటు చేసుకున్న ఈ ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ న్యూస్ ఏకంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శివన్ వద్దకు చేరడంతో బాలుడిని అభినందించాడు. చదువు విషయంలో ఆ బాలుడికి కావాల్సిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువకుడు ఇలా డిఫరెంట్ గా ఆలోచించి ఫోటో ఫ్లెక్సీ పెట్టుకోవడంతో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతుంది. దీంతో పాటు విద్యార్థి ఆలోచన తీరుపై కూడా నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. పదో తరగతి పరీక్షలో పాస్ పాస్ అయి తనకు తాను ఫోటో పెట్టుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్న విద్యార్థి ఆలోచనపై తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.