ప్రస్తుతం ప్రపంచం అంతా గూగుల్ చుట్టూ నడుస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. గూగుల్ కూడా స్పష్టమైన సమాచారాన్ని సెకన్లలో అందిస్తోంది. ఇదంతా ఇప్పుడెందుకంటారా? సాంప్రదాయాన్నే ఒక మతంగా భావించే భారతీయ మహిళలకు పెళ్లైయ్యాక ఎలా నడుచుకోవాలో తెలియకపోవడం సహజం. అయితే.. పెళ్లి తర్వాత అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలి అన్న విషయాలను తెలుసుకోవడానికి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట. తాజాగా బయటపడ్డ ఈ సర్వేలో ఎన్నో సంచలన నిజాలు వెల్లడయ్యాయి.. అవేంటో తెలుసుకుందాం.. గూగుల్ డేటా ప్రకారం.. కొత్తగా పెళ్ళైన మహిళలు భర్తలకు ఏదంటే ఎక్కువ ఇష్టమో ఎక్కువుగా వెతుకున్నారట. అంతేకాదు.. ఆ ఇష్టాలను ఎలా తెలుసుకోవాలి అన్న మార్గాలను కూడా అన్వేషిస్తున్నారట. ఇక తమ భర్త మనసు గెలుచుకుని వాళ్లను ఎలా సంతోషపెట్టాలి అనే ప్రశ్నను కూడా అనేక సార్లు గూగుల్‌లో వెతికినట్లు సర్వేలో వెల్లడైంది. ఇది కూడా చదవండి: వీడియో: లైవ్ లో యాక్సిడెంట్! తర్వాత ఆ వ్యక్తి చేసిన పనికి ఫ్యూజులు ఔట్! పెళ్లయిన తర్వాత కొత్త ఇంట్లో ఎలా ప్రవర్తించాలి? ఆ కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి? అత్తగారితో ఎలా నడుచుకోవాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు సెర్చ్ చేస్తున్నారట. భర్తకు ఆకర్షణీయంగా కనపడటానికి భార్యలు ముస్తాబవ్వడం సహజం. ఇలా భర్తలకు అందంగా.. ఆకర్షణీయంగా కనపడాలంటే ఏం చేయాలి? అన్న విషయాన్ని కూడా గూగుల్ లో శోధిస్తున్నారట. అన్నిటికంటే ముఖ్యంగా.. పెళ్లైన ప్రతి మహిళ, తమ భర్తను ఎలా అదుపులో పెట్టుకోవాలి? అందుకు మార్గాలేంటి? అన్న ప్రశ్నను తప్పక సెర్చ్ చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇంకా బిడ్డను కనడానికి సరైన సమయం ఎప్పుడు అని కూడా గూగుల్లోనే అన్వేషిస్తున్నారట. కుటుంబ సభ్యులందరినీ ఆకర్షిస్తూ, అందరికీ నచ్చే వంటకాలు చేసే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారట. ముఖ్యంగా భర్తలకు ఏ వంట ఎక్కువ ఇష్టమో అని సెర్చ్ చేస్తున్నారట. అంతేకాదు.. కుటుంబ బాధ్యతలు ఎలా చూసుకోవాలి.. సొంత కాపురం ఎలా సాగించాలి.. కుటుంబ వ్యవహారాన్ని ఎలా నడిపించాలి అన్న విషయాలను వెతుకుతున్నారట. పెళ్లయ్యాక సొంతంగా వ్యాపారం ఎలా సాగించాలి? కుటుంబ వ్యాపారాన్ని ఎలా నడిపించాలో తెలుసుకోవడానికి కూడా గూగుల్‌నే ఆశ్రయిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది.మరి.. కొత్తగా పెళ్లైన మహిళలు ఇలా గూగుల్ బాట పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.