మేకప్ మాయకి తమిళనాడుకు చెందిన హరి అనే యువకుడు మోసపోయాడు. 54 ఏళ్ల ఆంటీ మేకప్ మహిమతో 34 ఏళ్ల యువతిగా మారింది. ఇంకేముంది ఆమె అందం చూసి మనసు పారేసుకున్న హరి వెంటనే తాళి కట్టేశాడు. తర్వాత ఆమె అసలు రంగు, వయసు తెలియడంతో లబోదిబోమంటున్నాడు. స్థానిక పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కీలాడి ఆంటీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆమె గురించి తెలుసుకన్న పోలీసులు సైతం అవాక్కయారు. వివరాల్లోకి వెళ్తే…
తమిళనాడు తిరువళ్లురు జిల్లా పుదుప్పేట 65 ఏళ్ల ఇంద్రాణి అనే మహిళ కుమారుడి హరితో కలిసి నివాసం ఉంటుంది. అతడి వయసు 35 ఏళ్లు. ఓ ప్రైవేట్ కంపెనీలో మానేజర్‌గా పని చేస్తున్నాడు. హరికి ఇదివరకే వివాహం అయ్యింది. అయితే విబేధాల కారణంగా ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో 2021లో బ్రోకర్ ద్వారా తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన శరణ్య అనే మహిళ పరిచయం అయ్యింది. 54 ఏళ్ల వయసున్న శరణ్య వెంటనే బ్యూటీ పార్లర్‌కెళ్లి.. మేకప్ ద్వారా 34 ఏళ్ల యువతిలా హరిని పెళ్లి చేసుకుంది. అనంతరం కొంతకాలానికి అత్తంటి వారిపై వేధింపులకు దిగింది. ఆస్తి మొత్తం తన పేరున రాయాలని, జీతం, బీరువా తాళాలు తనకే ఇవ్వాని గొడవకు దిగింది. చివరకి హరి తల్లి ఇంద్రాణిని ఇంటి నుంచి బయటకు గెంటేసింది. అయితే ఈ క్రమంలో శరణ్య ఆధార్ కార్డు ద్వారా ఆమె వయస్సు బట్టబయలు అయింది.
అంతే కాక ఆమె చేసిన మోసం సైతం బయటపడింది. దీంతో మోసపోయానని గ్రహించిన హరి తిరువళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా ఈ 54 ఏళ్ల ఆంటి గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరుకు చెందిన శరణ్య ఇప్పటికే ముగ్గురిని మోసం చేసినట్లు తేలింది. శరణ్య అలియాస్ సుకన్యకి పుత్తూరుకి చెందిన రవితో వివాహం జరిగింది. అయితే కొద్ది కాలానికే భర్త నుంచి విడిపోయింది. అతడి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసింది. అనంతరం సుకన్య తల్లి దగ్గర ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రెండో వివాహం చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో పెళ్లిళ్ల బ్రోకర్లను కలిసి.. విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసేది.
ఈక్రమంలో సంధ్య గా పేరు మార్చుకుని సుబ్రహ్మణ్యన్ అనే అతడిని రెండో వివాహం చేసుకుని కొంత కాలనికి అతడిపై వరటకట్న వేధింపుల కేసులు పెట్టింది. అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి విడిపోయింది. ఈ క్రమంలో హరి గురించి తెలిసి.. అతడి వలేసింది. చివరకు ఇంద్రాణి కుమారుడు ఫిర్యాదుతో.. ఈ ఆంటీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి ఈ ఘరానా మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.