గురువు అంటే తండ్రితో సమానం అంటారు. గురువుని ప్రేమించాలి అంటే ఒక తండ్రిని ఒక కూతురు, ఒక తల్లిని ఒక కొడుకు ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమించాలి. కానీ ప్రేమించడం అనే పదానికి అర్థమే మార్చేశారు. ఎక్కడబడితే అక్కడ సుందరకాండ సినిమాలు ఆడేస్తున్నాయి. మొన్నా మధ్య ఒక టీచర్.. ప్రేమించిన విద్యార్ధి కోసం మగాడిగా మారి పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్య వయసు గ్యాప్ పెద్దగా లేదు కాబట్టి సమాజం ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మరీ కూతురు వయసున్న శిష్యురాలిని పెళ్లి చేసుకోవడం ఏంటి టూమచ్ కాకపోతే. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ సమాజం ఆఫ్ ఇండియాగా మారింది. ప్రేమ గుడ్డిది అని అంటారు. ఇందుకేనేమో.
ప్రేమకి వయసుతో, అందంతో పని లేదు. దీనికి ఈ టీచర్, స్టూడెంట్ ల ప్రేమాయణమే ఉదాహరణ. బీహార్ కి చెందిన 42 ఏళ్ల టీచర్.. 20 ఏళ్ల తన స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్నాడు. బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో రోస్డా బజార్ లో సంగీత్ కుమార్ అనే ఇంగ్లీష్ టీచర్ కి కోచింగ్ సెంటర్ ఉంది. ఇంగ్లీష్ కోచింగ్ కోసమని లో అదే ప్రాంతంలో ఉంటున్న శ్వేతా కుమారి కోచింగ్ సెంటర్ కి వెళ్ళేది. ఇద్దరి ఇళ్ళు 800 మీటర్ల దూరంలో ఉండేవి. ఇటు మాష్టారు భార్యామణి చాలా ఏళ్ల క్రితమే ఏకాకిని చేసి వెళ్ళిపోయింది. ఒక్కడే ఉంటున్నాడు. ఆడ తోడు కావాలని లోపల పురుగు గొలికేస్తుంది.
దీంతో తన స్టూడెంట్ ని లైన్ లో పెట్టాడు. ఇంగ్లీష్ పాఠాలు చెప్పడం మానేసి.. ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. అలా ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు. అలా ఈ ఇద్దరూ గురువారం నాడు ఒక గుడిలో ఏడడుగులు వేసి ఒకటయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది వీరి ప్రేమని అభినందిస్తుండగా.. మరి కొందరు మాత్రం ఏడ్చాడు వెర్రి సచ్చినోడు.. కూతురు వయసున్న పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. మరి 42 ఏళ్ల వయసున్న మాష్టారు ఇలా 20 ఏళ్ల వయసున్న విద్యార్థినిని పెళ్లి చేసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
न उम्र की सीमा हो! बिहार के समस्तीपुर में 42 साल के टीचर को 20 साल की स्टूडेंट से प्रेम हो गया..दोनों ने राजी खुशी विवाह रचाया..वीडियो खूब वायरल हो रहा..लोग मटुकनाथ और जूली की प्रेम गाथा को याद कर रहे..वीडियो-श्री राजपूत..Edited By- @Sinhamegha8 pic.twitter.com/dVp0KfoJGW
— Prakash Kumar (@kumarprakash4u) December 10, 2022