గుజరాత్ మోర్బీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మచ్చూ నదిపై గల తీగల వంతనె కుప్పకూలిపోవడంతో సుమారు 140 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఇప్పటి వరకు రిస్క్యూ టీమ్ 180 మందిని రక్షించారు. ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఈ దర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో కేబుల్ బ్రిడ్జీపై 400 మందికిపైగా జనాలు ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా.. సామర్థ్యానికి మించి ప్రజలు వెళ్లడం వల్ల జరిగిన పొరపాటా? అన్న దానిపై దేశ వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి.
2001 లో గుజరాత్ లో వచ్చిన భూకంపానికి ఈ బ్రిడ్జీ కొంత వరకు పాడైపోయింది. దీన్ని బాగు చేయడానికి ఓ ప్రైట్ కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పింది ప్రభుత్వం. దాదాపు రెండు కోట్లతో ఏడు నెలల పాటు దీని మరమ్మతు పనులు జరిగాయి. ఆ సమయంలో బ్రిడ్జీపైకి పర్యాటకుల రావడాన్ని నిషేదించారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత ఈ కేబుల్ బ్రిడ్జీ ఎంత వరకు సురక్షితం అన్న విషయంపై అసెంబ్లీలో చర్చ కూడా వచ్చింది. ఆ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు వంతెన పటిష్టతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎలాంటి ఢోకా లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు ఇక గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26న ఈ వంతెనకు అనుమతి ఇచ్చారు. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.
ఆదివారం కావడంతో చిన్నా పెద్దా ఈ వంతెనను చూడటానికి వచ్చారు. ఎక్కువగా మహిళలు, పిల్లలు ఈ వంతెనపైకి రావడం.. కొంత మంది యువకులు కేబుల్ బ్రిడ్జీని కేరింతలు కొడుతూ ఊపడం వంటికి వచేశారని.. సామర్ధ్యానికి మించి వంతెనపై జనాలు ఎక్కడమే కూలిపోవడానికి కారణం అని అంటున్నారు. అయితే ఈ వంతెనకు మున్సిపాటిటీ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ లభించలేదు అధికారులు అంటున్నారు. అయితే వంతెన సామర్ధ్యం ఎంతో తెలిసి కూడా జనాలు అలా వెళ్లడం వల్లనే ఈ పొరపాటు జరిగిందా? లేదా ఫిట్ నెస్ గురించి పూర్తిగా తెలియకుండా అనుమతిని నివ్వడం ప్రభుత్వం నిర్లక్ష్యమా? తప్పు ఎవరిదైనా ఎంతో మంది ప్రాణాలు బలి అయ్యాయి.
గుజరాత్ లో మచ్చు నదిపై ఏర్పాటు చేసిన ఈ వంతెన పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. తీగలతో ఉన్న ఈ వంతెనపై నడవడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. పర్యటకులకు ఇది ఎంతో గొప్ప అనుభూతినిస్తుంది. దర్బార్‌గఢ్ – నాజర్‌బాగ్‌ని కలుపుతూ ఈ తీగల వంతెన 1879 లో అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంటపుల్ నిర్మించారు. ఈ బ్రిడ్జీ నిర్మాణానికి రూ.3.5 లక్షల వరకు ఖర్చయినట్లు చరిత్ర చెబుతుంది. రిచర్డ్ టెంటపుల్ అప్పట్లో యూరప్ పరిజ్ఞానాన్ని వాడి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారట. అప్పట్లో భారత్ లో ఎంతో గొప్ప కట్టడాల్లో ఇది కూడా ఒకటని చెబుతారు.