బిజినెస్ డెస్క్- ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ సంస్థ జియో వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వార్షిక ప్రణాళికలో భాగంగా 3,499 ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ను కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లో డిల్ ప్లే చేస్తున్నారు. జియో అందించే ప్లాన్లలో ఇదే అత్యంత ఖరీదైన ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ 3,499 ప్లాన్ ద్వారా ప్రతి రోజు 3 జీబీ డేటా లభించనుంది.
జియో యాప్స్‌కు యాక్సెస్ ను కూడా ఈ ప్లాన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇతర ఓటీటీ ప్లాట్ ఫాంలకు యాక్సెస్ కు అవకాశం లేదని కంపెనీ స్పష్టం చేసింది. జియో 3,499 ప్లాన్ వ్యాలిడిటీ సంవత్సరం పాటు అంటే 365 రోజులుగా ఉంటుంది. రోజుకు 3 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే యోడాది పాటు 1,095 జీబీ డేటా అందించనున్నారు. ఈ 3 జీబీ డేటా పరిమితి అయిపోయాక బ్రౌజింగ్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ప్లాన్ లో భాగంగా లభించనున్నాయి.
ఇక 3, 499 ప్లాన్ తో జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్‌కు కూడా యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఇతర ఓటీటీలు ఐన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 వంటి యాప్స్‌కు యాక్సెస్ అవకాశం లేదు. జియో 999 ప్లాన్ కూడా రోజుకు 3 జీబీ డేటాను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే. ఇక జియో ఇటీవలే చవకైన 4జీ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. జియోఫోన్ నెక్స్ట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.