కొత్త సిమ్ కార్డు తీసుకునేప్పుడు టెలికాం ఆపరేటర్ల దగ్గర ఉన్న ఫోన్ నంబర్లలో మనకు నచ్చింది తీసుకుంటారు లేదా చివరిలోనే, మొదటిలోనే బాగుంది అనుకున్న నంబర్ల ఆధారంగా సిమ్ కార్డులు కొంటుంటారు.
సెలబ్రిటీ దగ్గరే ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. మనకు కావాలంటే.. డబ్బులు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. దీంతో కొత్త సిమ్ కార్డు తీసుకునేప్పుడు టెలికాం ఆపరేటర్ల దగ్గర ఉన్న ఫోన్ నంబర్లలో మనకు నచ్చింది తీసుకుంటారు లేదా చివరిలోనే, మొదటిలోనే బాగుంది అనుకున్న నంబర్ల ఆధారంగా సిమ్ కార్డులు కొంటుంటారు. అంతే గానీ మనకు అచ్చొచ్చిన నంబర్లు, డేట్ ఆఫ్ బర్త్, లేదా ముఖ్యమైన తేదీలతో కూడా సిమ్ కార్డులు దొరుకుతాయంటే కష్టమే. పోనీ మనకు ఇష్టమైన నంబర్లతో కూడిన సిమ్ కార్డు ఇస్తారా అంటే సాధ్యమవ్వని పని. అవసరానికి ఏ నంబర్ సిమ్ దొరికితే.. దాన్నే కొనుగోలు చేసి వినియోగించుకుంటుంటారు. సాధారణంగా ఇలానే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఓ సదావకాశాన్ని కల్పిస్తుంది ప్రముఖ రిలయన్స్ సంస్థకు చెందిన జియో. ఓ బంపర్ ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది.
జియో ఖాతాదారులందరికీ శుభవార్త. మనకు నచ్చినట్లుగా మనకు ఇష్టమైన సంఖ్యలతో ఉన్న ఫోన్ నంబర్ తీసుకునే వెసులుబాటు తీసుకువచ్చింది. ఇప్పుడు జియో నెట్ వర్క్ యూజర్లందరూ దీనికి అర్హులే. దీని కోసం కొత్త స్కీంను రూపొందించింది. చాయిస్ నంబ్ర (చాయిస్ నంబర్) పేరుతో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అంటే చివరి నాలుగు, ఐదెంకలు ఎంచుకునే సౌలభ్యాన్ని కల్పించింది. దీంతో ఇప్పుడు మీ లక్కీ నంబర్స్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డే, ముఖ్యమైన రోజులతో కూడిన నంబర్లతో సిమ్స్ తీసుకోవచ్చునన్న మాట. మీ మొబైల్ నెంబర్ చివర.. 143, 007, 786 నెంబర్స్ కావాలా? చాలా ఈజీ! ఈ అవకాశాన్ని గతంలో బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా అందించగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి జియో వచ్చింది. అయితే ఈ నంబర్ కావాలంటే దీనికొక ప్రాసెస్ ఉందండోయ్. ఆ ప్రకారం చేస్తే మీరు కోరుకున్న అంకెలతో సిమ్ తీసుకోవచ్చు.