అది కూడా భూమికి లక్ష కిలోమీటర్ల ఎత్తులో పెళ్లి చేసుకోవచ్చు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. స్పేస్ పర్‌స్పెక్టివ్ అనే కంపెనీ అంతరిక్షంలో పెళ్లి చేసుకునేందుకు వీలుగా కార్బన్ న్యూట్రల్ బెలూన్ వాహనాన్ని తయారు చేసింది.
ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని ఓ అద్భుత ఘట్టం. మిగిలిన జీవితాన్ని గడిపే వ్యక్తులతో జరిగే మొదటి శుభాకార్యం గనుక అందరూ దాన్ని గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌లు తెగ పెరిగిపోయాయి. ఇవి చాలవన్నట్లు చాలా కొత్తగా.. వింతగా.. విమానంలో పెళ్లిళ్లు.. నీళ్లలో పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీటిని మించిన కొత్త ఆలోచన ఒకటి తెరపైకి వచ్చింది. త్వరలో అంతరిక్షంలో పెళ్లి చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
అది కూడా భూమికి లక్ష కిలోమీటర్ల ఎత్తులో పెళ్లి చేసుకోవచ్చు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. స్పేస్ పర్‌స్పెక్టివ్ అనే కంపెనీ అంతరిక్షంలో పెళ్లి చేసుకునేందుకు వీలుగా కార్బన్ న్యూట్రల్ బెలూన్ వాహనాన్ని తయారు చేసింది. ఆ వాహనం మొత్తం అద్దాలతో ఉంటుంది. అందులోంచి భూమి మొత్తం అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది భూమికి లక్ష కిలోమీటర్ల ఎత్తులోకి వెళుతుంది. మళ్లీ భూమి పైకి రానుంది. ఈ ప్రయాణం మొత్తం 6 గంటల పాటు సాగనుంది.
2024 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అంతరిక్షంలో పెళ్లి చేసుకోవటానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. లక్షో.. పది లక్షలో కాదు.. ఏకంగా కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అయినప్పటికి, అంతరిక్షంలో పెళ్లి చేసుకోవటానికి ఎంతో మంది ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే 1000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం అంతరిక్ష ప్రయాణం చేసే వాహనానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, అంతరిక్షంలో పెళ్లి వేడుకపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.