ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో వేగంగా ముందుకు సాగుతుంది. మనుషులు కూడా కాలానుగుణంగా మారుతున్నారు. ఒకప్పుడు వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇచ్చిన వారు.. ఇప్పుడు ఆ బంధాన్ని మచ్చ తెస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇక సమాజంలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతుంటాయి. కొంతమంది తీసుకునే వింతైన నిర్ణయాలు మనకు ఆశ్చర్యానికి కలిగించక మానవు. ఇలాంటి వింతనై ఆలోచనలు అలోచించేవారిని చూసి పక్కున నవ్వుకునేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.
తాజాగా ఇంగ్లాండ్ లోని లండన్ కు చెందిన అమాండ రోడ్జర్స్(47)అనే మహిళ చేసిన వింతైన పని చూసి అందరై ఔరా అంటున్నారు. వివరాల్లోకి వెళితే అమాండ రోడ్జర్స్ ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది. ఈ సందర్భంలో కాలక్షేపాణికి రెండు నెలల వయస్సున ఓ కుక్కును తెచ్చుకుంది. దానికి షెబా అని పేరు పెట్టి చాలా ప్రేమగా పెంచుకుంటుంది. అప్పుడప్పుడు ఆ షెబా చేసే విన్యాసాలకు అమాండ ఫిదా అయ్యేది. అలా సాగిపోతున్న అమాండా జీవితంలో ఇటీవల ఒకరితో ప్రేమలో పడింది. అది ఎవరో కాదు తాను పెంచుకుంటున్న కుక్కపిల్ల షెబానే.
షెబా ఆమెపై ఎంతో ప్రేమ చూపిస్తుందని, మనుషుల ప్రేమల కంటే దీని ప్రేమ స్వచ్ఛమైనది అని అమాండ తెలిపింది. షెబానుకు లవ్ ప్రపోజ్ చేస్తే అంగీకారంగా తోక ఊపిందని ఆమె తెలిపింది. అంతటితో ఆగని అమాండ తన పెంపుడు కుక్క షెబానాను 200 మంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఆ చుట్టు పక్కల వారికి అమాండా, షెబాన ప్రేమ పెళ్లి వింతగా అనిపించింది. అమండా అవేమీ పట్టించుకోకుండా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నట్లు తెలిపింది. జీవితాన్ని మనకు ఇష్టమైన విధంగా గడపాలని ఎవరి కోసమో మార్చుకోవద్దని అమాండ అన్నారు.