తల్లిదండ్రులు.. కుమార్తె అని ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. అల్లారుముద్దుగా పెంచడమే కాక బాగా చదివించారు. ఆమె కూడా తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకుని నర్సింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కుమార్తెకు మంచి సంబంధం చూసి వివాహం చేశారు. ఆ తర్వాత కుమార్తె.. భర్తతో కలిసి ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లింది. ఇక వారికి ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు బాబు, పాప సంతానంగా ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో.. అనుకోని విషాదం చోటు చేసుకుంది. కుమార్తె, మనవడు, మనవరాలు.. మృతి చెందడం కలకలం రేపింది. భర్త, పిల్లలతో నిండు నూరేళ్లు.. సంతోషంగా జీవిస్తుందనుకున్న కుమార్తె.. ఇలా ఆకస్మాత్తుగా మృతి చెందడం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకు వారి కుమార్తె, మనవడు, మనవరాలు ఎలా మృతి చెందారు.. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదవండి.
కేరళ, కొట్టాయంకు చెందిన అంజు అనే మహిళకు.. 2012లో కన్నూర్‌కు చెందిన సంజుతో వివాహం అయ్యింది. అంజు నర్స్‌గా పని చేస్తుంది. వారికి ఇద్దరు సంతానం ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల పాప ఉన్నారు. సంజు మొదట్లో.. సౌదీలో పని చేసేవాడు. పెళ్లి తర్వాత.. భార్య అంజును తీసుకుని సౌదీ వెళ్లాడు. కొన్నాళ్లు అక్కడే ఉన్నాడు. అప్పుడే వారికి పిల్లలు పుట్టారు. ఇక రెండేళ్ల క్రితం భార్యాభర్తలిద్దరూ యూకే వెళ్లారు. లండన్ సమీపంలోని నార్తంప్టన్ ప్రాంతంలో కెట్టరింగ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అంజు నర్స్‌గా పని చేస్తోంది. సంజు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం అంజు, ఆమె ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో.. అపాస్మారక స్థితిలో కనిపించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ నుంచి కేకలు వినిపించాయని.. స్థానికులు తెలిపారు. అపార్ట్‌మెంట్ భవనంలో కత్తిపోటు గాయాలతో ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఇక అంజు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా.. తీవ్రంగా గాయపడిన చిన్నారులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించడమే కాక సంజును ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే దోషులను అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.
కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసి కొట్టాయంలోని అంజు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. జరిగిన దారుణం గురించి శుక్రవారం రాత్రి పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అంజును ఉరేసి చంపినట్టు పోస్ట్‌మార్టంలో వెల్లడైనట్టు తమకు చెప్పారని ఆమె తల్లిదండ్రులు వివరించారు. అంతేకాదు, కుమార్తె, మనవడు, మనవరాలు మృతదేహాలను ఇక్కడకు తీసుకురావాలంటే రూ.30 లక్షలు ఖర్చువుతాయని, అంత మొత్తం తమ దగ్గర లేదని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ అల్లుడు సంజు కోపిష్టి అని.. చాలా తొందరగా అతడికి కోసం వస్తుందని తమకు తెలుసని.. గతంలో అతడు తమ కుమార్తె అంజు, బాబుని దారుణంగా కొట్టిన సందర్భాలున్నాయని.. కానీ ఇలా ప్రాణాలు తీస్తాడని తాము ఊహించలేదని చెప్పి ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలో లేదు. మరి అంజు, ఆమె పిల్లలను భర్తే చంపి ఉంటాడా.. లేక ప్రమాదామా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.