చాలా మంది దేవుళ్లపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. అందుకే నిత్యం దైవ పూజ, దైవ దర్శనాలు చేస్తుంటారు. ఇలా దేవాలయాలు దర్శించిన సమయంలో విరాళాలు కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపార వేత్త ఆలయ నిర్మాణానికి రూ.250 కోట్ల విరాళం ఇచ్చారు.
చాలా మంది దేవుళ్లపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. అందుకే నిత్యం దైవ పూజ, దైవ దర్శనాలు చేస్తుంటారు. ఇలా దేవాలయాలు దర్శించిన సమయంలో విరాళాలు కూడా ఇస్తుంటారు. అంతేకాక మరికొందరు దేవాలయాల నిర్మాణానికి కూడా విరాళాలు అందిస్తుంటారు. తాజాగా యూకేలో నిర్మిస్తున్న జగన్నాథ స్వామి ఆలయానికి.. భారత సంతతి వ్యక్తి రూ.250 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బ్రిటన్ లో నివాసం ఉంటున్న పెద్ద పారిశ్రామిక వేత్త బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో నిర్మిస్తున్న తొలి జగన్నాథ స్వామి ఆలయానికి భారీగా విరాళం ఇచ్చారు. ఈ ఆలయ నిర్మాణానికి నిధులను సేకరిస్తున్న సంస్థకు ఆయన రూ.250 కోట్లు విరాళం ఇచ్చారు. భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో నిర్మిస్తున్న ఆలయానికి అందించిన అతిపెద్ద విరాళాలలో ఇది ఒకటి. బిశ్వనాథ్ పట్నాయక్ ఒడిశా నుంచి కొన్నేళ్ల క్రితం బ్రిటన్ కు వెళ్లారు. ఇక అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిపోయారు.
బ్రిటన్ లో బిశ్వనాథ్ పెట్టుబడుల సంస్థ ఫిన్ నెస్ట్ ను స్థాపించారు. ప్రస్తుతం ఆయనే ఆ కంపెనీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు లండన్ శివారులో జగన్నాథ్ స్వామి ఆలయం నిర్మించేందుకు అక్కడి స్థానికులు శ్రీ జగన్నాథ సొసైటీ యూకే అనే ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ఈ ఆలయ నిర్మాణం కోసం దాదాపు 15 ఏకరాల్లో ఉపయోగిస్తున్నారు. 2024 చివరి నాటికి తొలిదశ నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో ఎస్ జేఎస్ యూకే సంస్థ ఉంది.
ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన ఎన్నికల ప్రచార సమయంలోనూ జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే అక్షయ తృతీయ రోజున జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బిశ్వనాథ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన రూ.250 కోట్ల విరాళం ప్రకటించారు. యూకేలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించాలనే కలను సాకారం చేసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.
ఈ సందర్బంగా శ్రీ జగన్నాథ సొసైటీ యూకే చైర్మన్ డాక్టర్ సహదేవ్ స్వైన్ మాట్లాడుతూ.. లండన్‌లోని జగన్నాథ ఆలయం యూరప్‌లో జగన్నాథ సంస్కృతికి కేంద్రంగా మారుతుందని అన్నారు. అలానే వేలాది మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరి.. ఈ భారీ విరాళం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.