ఏడాదికి రూ.1.30 కోట్ల జీతం, నెలకు 20 రోజుల సెలవు, వసతి కూడా ఉచితం.. చదవగానే బంపరాఫర్ అనిపిస్తుంది కదా.. మరి ఏవరికి ఈ జాబ్ ఆఫర్ అంటే వైద్యులకు.. ఎక్కడంటే..
ప్రస్తుత కాలంలో బాగా డిమాండ్ ఉన్న ఉద్యోగాలు అంటే ఒకటి ఐటీ జాబ్‌లు.. రెండు మెడికల్ ఫీల్డ్. కరోనా తర్వాత మెడికల్ ఫీల్డ్‌లో సిబ్బంది కొరత ఎంత ఎక్కువగా ఉందో.. ఈ రంగంలో ఎక్కువ సిబ్బింది ఎందుకు అవసరమో.. ప్రపంచంలోని అన్ని దేశాలకు తెలిసి వచ్చింది. ఇప్పటికే పలు దేశాలు.. తమ బడ్జెట్‌లో వైద్య రంగానికిన కేటాయింపులు పెంచడమే కాక.. సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. దాంతో ఈ రంగంలో ఉద్యోగులు అనగా డాక్టర్లు, నర్స్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వారు అడిగినంత జీతం ఇవ్వడమే కాక.. మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇక తాజాగా డాక్లర్లు కావాలంటూ పేపర్లో ఇచ్చిన ఓ యాడ్ తెగ వైరలవుతోంది. దీనిలో తమ ఆస్పత్రిలో చేరే వైద్యులకు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం ఇవ్వడమే కాక.. నెలకు 20 రోజుల పాటు సెలవులు ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాఉల..
అయితే ఈ ఆఫర్ మన దేశంలో కాదు. యూకేలో పని చేసే వైద్యులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. యూకేలో పని చేస్తోన్న అనుభవజ్ఞలైన డాక్టర్లను ఆస్ట్రేలియా రప్పించేందుకు గాను.. భారీ వేతనంతో పాటు .. మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ఏడాదికి రూ.1.30 కోటి వేతనంతో పాటు నెలకు 20 రోజులు సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది. పైగా సెలవు రోజుల్లో.. ట్రావెలింగ్, స్విమ్మింగ్, సర్ఫింగ్ చేయవచ్చని పేర్కొంది. అంతేకాక ఉచిత వసతితో పాటు బోనస్ కూడా ఇస్తామని ప్రకటించింది.
యూకేలోని గ్రాడ్యుయేట్ డాక్టర్లను ఆస్ట్రేలియా ప్రభుత్వం టార్గెట్ చేసుకుని ఈ యాడ్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది. దీనిలో ఉన్న వివరాలు ఇలా ఉనఆయి. యాక్సిడెంట్, ఎమర్జెన్సీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ఇక జాబ్ యాడ్ ప్రకారం.. నెలకు 10 షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. మిగతా 20 రోజులు సెలవు. ఇక వేతనం 2,40,000 ఆస్ట్రేలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1.3 కోట్లు. దీంతో పాటు వసతి సదుపాయం కూడా ఉచితమేనట. ఇక ఈ ప్రకటనను ఆథర్, మాజీ మెడికల్ స్పెషలిస్ట్ ఆడమ్ కే ట్విట్టర్‌లో షేర్ చేశారు. 12 నెలలు పూర్తి చేసిన తర్వాత కంప్లీషన్ బోనస్ కింద రూ.10 లక్షల వరకు అందుతుందని యాడ్‌లో పేర్కొన్నారు. ఈ యాడ్ చూసిన జనాలు.. ఇది కదా అసలు సిసలు జాబ్ ఆఫర్ అంటున్నారు జనాలు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
How depressing to see this in the BMJ. It’s hard to say those figures don’t present a compelling argument. It all leads to a big question for the govt: if you don’t address doctors’ very reasonable pay concerns, alongside their conditions and wellbeing, guess where they’re going? pic.twitter.com/24oKKrgfLa
— Adam Kay (@amateuradam) May 3, 2023