ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు.. ఎదుటివారికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి నిలువునా దోచేస్తున్నారు. తాము దారుణంగా మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీస్తున్నారు.
డబ్బుకు లోకం దాసోహం.. డబ్బు మనిషిచే ఏపనైనా చేయిస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్ని ఘోరాలు చేయడానికైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేస్తూ అడ్డగోలిగా డబ్బులు సంపాదిస్తున్నారు. పెన్షన్ కోసం ఓ వృద్దుడిని ఏకంగా రెండేళ్ల పాటు ఫ్రిడ్జ్ లో దాచాడు ఓ ఘనుడు. ఈ ఘటన బర్మింగ్ హూమ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
బర్మింగ్‌హామ్ లోని క్లీవ్ ల్యాండ్ టవర్ వద్ద డామియాన్ జాన్సన్, జాన్ వైన్‌రైట్ ఓ ఫ్లాట్ లో నివసిస్తున్నారు. వైన్‌రైట్ వయసు 71 సంవత్సరాలు.. వృద్దాప్య కారణంగా 2018 సెప్టెంబర్ నెలలో మరణించాడు. ఈ క్రమంలో డామియాన్ జాన్సన్ ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వైన్‌రైట్ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా గుట్టుగా ఫ్రిడ్జ్ లో దాచాడు. ఇక వైన్‌రైట్ కి వస్తున్న పెన్షన్ డబ్బులు తన సరదాల కోసం వాడుకోవడం మొదలు పెట్టాడు. వైన్‌రైట్ కార్డులను కూడా ఉపయోగించేవాడు జాన్సన్. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పెన్షన్ డబ్బులు వాడుకుంటున్న జాన్సన్ పాపం పండింది. 2020 లో పోలీసులు వైన్‌రైట్ కి సంబంధించిన ఖాతా వివరాలపై ఆరా తీయగా అసలు నిజం బయట పడింది. ఈ క్రమంలో జాన్సన్ పై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే గతంలో డామియాన్ జాన్సన్, జాన్ వైన్‌రైట్ జాయింట్ ఖాతా తెరిచారు. ఈ క్రమంలో వైన్‌రైట్ కి వచ్చే పెన్షన్ ఆ ఖాతాలోనే పడేవి. వీటిని వినియోగించుకునేందు వైన్‌రైట్ బతికే ఉన్నట్లు జనాలను, బ్యాంక్ ని నమ్మించాడు జాన్సన్. అందుకే అతను చనిపోయినా రెండేళ్ల పాటు ఫ్రిడ్జ్ లోనే దాచి ఉంచినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ నేపథ్యంలో జాన్సన్ ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఖాతాను వినియోగించుకునే హక్కు జాన్సన్ కి ఉంది.. అతడు అర్హుడే అని భావించిన కోర్టు.. అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే వైన్‌రైట్ ఎలా మరణించాడు అనేది మాత్రం బయటపడలేదు.