సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇప్పటి వరకు చూడని వింతలు విశేషాలు చూడగలుగుతున్నాం. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది తమ టాలెంట్ చూపిస్తూ రాత్రికి రాత్రే స్టార్లు అవుతున్నారు.
నేటి యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో అవుతుంది. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు సోషల్ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు. టెక్నాలజీ పెరిగిపోయింది.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి.. దానికి తోడు ఇంటర్ నెట్ అందుబాటులో ఉండటంతో సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అవుతున్నారు. సాధారణంగా యూట్యూబ్ లో కొన్ని టిప్స్ చెబుతుంటారు. ఫిట్ నెస్, అందం, ఆరోగ్యం గురించి వచ్చే ప్రోగ్రామ్స్ చాలా మంది ఫాలో అవుతుంటారు. అలా ఓ మహిళ టిక్ టాక్ లో వచ్చిన రెసిఫీ ఫాలో అయింది.. అదే ఆమెకు పెద్ద శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే..
షాఫియా బషీర్ అనే ఓ మహిళ గత కొంతకాలంగా టీక్ టాక్ వీడియోలు చేస్తుంది. ఎప్పటి నుంచో ఓ వెరైటీ రెసిపీ చేసి జనాలను సర్పైజ్ చేయాలనే ఆలోచనలో ఉంది ఫాఫియా. తాను చేసే రెసిపీ సోషల్ మీడియాలో మంచి లైక్స్ రావాలని.. ఒక ట్రెండ్ సృష్టించాలని అనుకూంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఓ ప్రత్యేకమైన వంటకం చేసి వీడియో తీయాలనుకుంది. మొదట గుడ్లను మైక్రోవేవ్ లో ఉడకపెట్టింది. ఉడికిన గుడ్లను బయటకు తీయాలనుకుంది. అందుకోసమని చల్లని చెంచాను మైక్రోవేవ్ లో పెట్టింది. అంతలోనే అందులో ఉన్న వేడీ నీరు ఓక్కసారిగా ఆమె ముఖం మీద పడ్డాయి.
ఆ మంటను తట్టుకోలేక ఆమె ముఖాన్ని చల్లని నీటిలో కడిగింది.. దాంతో ముఖం మీద తీవ్రగాయాలయి బొబ్బలు వచ్చేసాయి. దీంతో ఆ మహిళ బాదను తట్టుకోలేక ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. అయితే ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటునాన్నని చెప్పుకొచ్చింది. నేను ఇంట్లో ఒంటరి మహిళ అయినందు వలన ఖాళీ సమయం దొరుకుతుందని.. అందుకోసమనే టిక్-టాక్ లో వంటల వీడియోలు చేస్తానని ఫాఫియా తెలిపింది. ఇక ఈ సంఘటన నాకు ఓ గుణపాఠం.. ఇలాంటి తొందరపాటు చర్యలు చేయకుండా మంచి బుద్ది వచ్చింది. ఎప్పుడైనా, ఎవరైనా టిక్-టాక్ వీడియోలు చేస్తున్న క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ప్రమాదాలు కోరి తెచ్చుకున్నవాళ్లమవుతామని తెలిపింది.