ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పని దినాలు నాలుగున్నర రోజులు మాత్రమే అని ప్రకటించింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వారి పనిదినాల క్యాలెండర్ లో మార్పులు చేసింది. గతంలో శని, ఆది వారాలను సెలవు దినాలుగా ప్రకటించిన యూఏఈ.. తాజాగా పని దినాలను 4.5 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లతో మరింత అనుసంధానం అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది.
#UAE announces today that it will transition to a four and a half day working week, with Friday afternoon, Saturday and Sunday forming the new weekend.
All Federal government departments will move to the new weekend from January 1, 2022. pic.twitter.com/tQoa22pai9
— UAEGOV (@UAEmediaoffice) December 7, 2021
సెలవు దినాలను పొడిగించడంపై యూఏఈ ప్రభుత్వం స్పిందించింది. ‘శని, ఆదివారాలు సెలవులుండే దేశాలతో ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. దీంతో దేశంలో పనిచేసే వేలకొద్దీ అంతర్జాతీయ కంపెనీలతో ఆర్థిక లావాదేవీలు సరళంగా జరుగుతాయి’ అంటూ యూఏఈ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం శని, ఆదివారాలు సెలువు దినాలుగా ఉన్నాయి. జనవరి 1, 2022 నుంచి సెలవు దినాలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం వరకు కొనసాగుతాయి. ఈ నిర్ణయంతో వ్యక్తుల జీవితం- పని మధ్య సమతౌల్యం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. యూఏఈ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.