ఈమధ్య కాలంలో వాహనాల నంబర్ ప్లేట్స్ కోసం భారీ మొత్తం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నంబర్ ప్లేట్ కోసం వేలల్లో ఖర్చు చేయడం వరకు ఓకే. కొందరు లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారని వార్తల్లో చూస్తున్నాం. కానీ ఇక్కడో వ్యక్తి ఏకంగా వందల కోట్లు ఖర్చు చేశారు.
మంచి కారు కొనాలనుకుంటే రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే వచ్చేస్తుంది. సెకండ్ హ్యాండ్లో అయితే రూ.3 నుంచి రూ.4 లక్షలు పెడితే కండీషన్ బాగున్న కారు దొరుకుతుంది. అదే రూ.20 లక్షల పైన ఖర్చు పెట్టగలిగితే ప్రీమియం కార్లు సొంతం చేసుకోవచ్చు. ఇంకా డబ్బులు ఖర్చు పెడతామంటే లగ్జరీ కార్లు కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడో వ్యక్తి మాత్రం కారు నంబర్ కొనేందుకు వందల కోట్లు ఖర్చు చేశారు. ఏంటా నంబర్? దాని కోసం కోట్లు వెచ్చించడం ఎందుకనే కదా మీ సందేహం. అవును, ఇది నిజమే. వరల్డ్‌లోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ ఇదేనని తెలుస్తోంది.
యూఏఈ ప్రభుత్వం రంజాన్ ఇఫ్తార్ కోసం వేలంపాట నిర్వహించింది. 1 బిలియన్ మీల్స్ కోసం ఈ ఆక్షన్ వేసింది. ఈ వేలంపాటలో పీ7 అనే నంబర్ కోసం ఏకంగా రూ.122 కోట్లకు పైగా ఖర్చు చేశారు ఓ వ్యక్తి. ఒక నంబర్ ప్లేట్ కోసం గతంలో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ ఖర్చు చేయలేదట. ఈ కారు నంబర్ ప్లేట్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు ఛారిటీకి వెళ్తాయని యూఏఈ అధికారులు తెలిపారు. పీ7 కారు నంబర్ ప్లేట్‌తో పాటు ఇతర నంబర్ ప్లేట్లను వేలం వేశారు. చివరగా 2008లో అబుదాబిలో నిర్వహించిన వేలంపాటలో కారు నంబర్ ప్లేట్ ధర ఏకంగా 52.2 మిలియన్ డాలర్ల దిర్హమ్స్ (భారత కరెన్సీలో రూ.116.3 కోట్లు) పలికింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రేటు పలకడం విశేషం.
#Dubai‘s plate number 7 has set a world record after selling for Dh55 million ($15 million) at auction.
In total, nearly Dh100 million ($27 million) was raised from the sale of car plates and mobile phone numbers.
All proceeds from the auction will go to the @OneBillionMeals… pic.twitter.com/uyemoco5Bh
— The National (@TheNationalNews) April 9, 2023