క్రికెట్లో కొన్ని అరుదైన మైలురాళ్లు ఉంటాయి. దాదాపుగా వాటిని స్టార్ బ్యాటర్లే అధిగమిస్తుంటారు. అయితే కొందరు అనామక ప్లేయర్లు స్టార్ ప్లేయర్లకు దీటుగా రాణించి రికార్డులు నమోదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
క్రికెట్లో మునుపటి కంటే వేగం పెరిగింది. ఫ్లాట్ పిచ్‌లు, ఫీల్డింగ్ నిబంధనలు మారడం, ఆధునిక బ్యాట్ల వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇప్పడంతా బ్యాట్స్మెన్లదే ఆధిపత్యం. టెస్టుల్లోనే బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య అంతో ఇంతో సమతూకం కనిపిస్తోంది. తప్పితే మిగిలిన ఫార్మాట్లలో బ్యాట్స్మెన్ల జోరు నడుస్తోంది. ఇప్పుడు టీ20ల్లోనే సెంచరీలకు సెంచరీలు బాదేస్తున్నారు బ్యాటర్లు. కానీ ఒకప్పుడు వన్డే క్రికెట్లో వంద కొడితేనే గొప్ప అనేలా ఉండేది. ఇక, డబుల్ సెంచరీ అనేది ఎవరి ఊహకూ అందనిది. కానీ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ లాంటి పలువురు బ్యాటర్లు 50 ఓవర్ల ఫార్మాట్లో డబుల్ సెంచరీ కొట్టడం సులువేనని నిరూపించారు.
భారత మాజీ సారథులు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలు తమ కెరీర్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పినా వన్డేల్లో డబుల్ సెంచరీ ఫీట్‌ను మాత్రం అందుకోలేదు. ఓడీఐ క్రికెట్లో ఇద్దరి అత్యుత్తమ స్కోరు ఒకటే కావడం విశేషం. ఈ ఇద్దరు క్రేజీ బ్యాటర్లు 183 స్కోరు చేయడం విశేషం. అలాంటి వీరి రికార్డును ఒక బ్యాట్స్‌మన్ అధిగమించాడు. యూఏఈ స్టార్ బ్యాటర్ వృత్య అరవింద్ గురించి వినే ఉంటారు. యూఏఈ జట్టులో ఇతడే పించ్ హిట్టర్. గ్రౌండ్లోకి దిగాడంటే చాలు.. ఫోర్లు, సిక్సులతో బౌలర్లను ఊచకోత కోస్తుంటాడు వృత్య అరవింద్. భారత సంతతికి చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మరో అరుదైన ఘనతను సాధించాడు.
కువైట్ టీమ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో అరవింద్ భారీ స్కోరు బాదాడు. 147 బాల్స్‌లో ఏకంగా 185 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అరవింద్ బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ అరవింద్ ఇన్నింగ్స్‌తో ఏకంగా 371 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో కువైట్‌కు శుభారంభం దక్కలేదు. మొదట్లోనే వికెట్లు పడటంతో ఆ జట్టు తడబడుతోంది. 6 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 46 రన్స్ చేసింది.
Vriitya Aravind registered the highest individual score (185) for the United Arab Emirates in ODIs against Kuwait.
Well played, young lad! 👏#CricTracker #VriityaAravind #UAEvKUW #ODIs pic.twitter.com/5YwyinNBe3
— CricTracker (@Cricketracker) April 19, 2023