యూట్యూబ్ ద్వారా ఎంతోమంది బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. నెలకు లక్షలు, కోట్లు సంపాదించే వారు కూడా ఉన్నారు. ఓ యువకుడు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు. అతను ఎవరంటే?
పేరుకే యూట్యూబర్ కానీ దుబాయ్ లో 60 కోట్ల విలువైన ఇల్లు, 23 కోట్ల విలువైన కార్లు, 369 కోట్ల ఆస్తులు కలిగిన భారతీయుడు అతను. పేరు గౌరవ్ చౌదరి. 1991లో రాజస్థాన్ లోని అజ్మీర్ లో జన్మించారు. బిట్స్ పిలానీ యొక్క దుబాయ్ క్యాంపస్ లో మైక్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. 2015లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నారు. పలు మీడియా కథనాల ప్రకారం ఈయన తన ఫ్యామిలీ కిరాణా బిజినెస్ ని చూసుకునే వారని తెలుస్తోంది. ప్రస్తుతం టెక్నికల్ గురూజీ, గౌరవ్ చౌదరి అనే రెండు యూట్యూబ్ ఛానల్స్ ని నడుపుతున్నారు. భారత్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన యూట్యూబర్ గా పేరుంది. ప్రస్తుతం గౌరవ్ చౌదరి దుబాయిలో నివసిస్తున్నారు.
ఈయన యూట్యూబర్ మాత్రమే కాదు, దుబాయ్ లో వ్యాపారవేత్త కూడా. ఇతను దుబాయ్ పోలీసులకు, పోలీస్ సెక్యూరిటీ సంస్థలకు సెక్యూరిటీ ఎక్విప్మెంట్ సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతను దుబాయ్ పోలీస్ సర్టిఫై చేసిన సిస్టమ్స్ ఇంజనీర్ అని తెలుస్తోంది. దుబాయ్ లో ఇతను రూ. 60 కోట్లు విలువ చేసే ఇంట్లో ఉంటున్నారు. ఇతని దగ్గర 11 లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపుగా రూ. 23 కోట్ల పైనే విలువ చేసే లగ్జరీ కార్లు ఇతని దగ్గర ఉన్నాయి. ఇంత లగ్జరీగా ఉండడానికి కారణం యూట్యూబ్ ఛానల్ తో పాటు దుబాయ్ లో వ్యాపారం కూడా ఉంది. మొత్తం ఇతని ఆస్తుల విలువ 45 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం రూ. 369 కోట్లు పైనే. యూట్యూబ్ లోనే కాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇతని నెల సంపాదన రూ. కోటి కన్నా ఎక్కువే. టెక్ వీడియోలు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న గౌరవ్ చౌదరిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.