Tiktok: టిక్‌టాక్ మన దేశంలో బ్యాన్ అయిపోయిన సంగతి తెలిసిందే. బ్యాన్ అవ్వటానికి ముందు మన దేశంలో టిక్‌టాక్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కొన్ని కోట్ల మంది దాన్ని వాడేవారు. వేల సంఖ్యలో సెలెబ్రిటీలు తయారయ్యారు. అంతేకాదు! టిక్‌టాక్ వీడియోలు చేయటానికి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. అయితే, చైనాతో విభేదాల కారణంగా భారత్ టిక్‌టాక్‌తో పాటు మరికొన్ని యాప్స్‌ను బ్యాన్ చేసింది. మన దేశంలో లేకపోయినా ఇతర దేశాల్లో మాత్రం టిక్‌టాక్ తన హవా కొనసాగిస్తోంది. కొత్త ఛాలెంజ్‌లు పుట్టుకువస్తున్నాయి. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. టిక్‌టాక్ కారణంగా చాలా మంది ప్రాణాలు రక్షించబడుతున్నాయి.
తాజాగా, టిక్‌టాక్ హ్యాండ్ సింబల్‌ను ఉపయోగించి ఓ మహిళ తన ప్రాణాలను కాపాడుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, టెన్నిసీలోని హిక్‌మ్యాన్ కౌంటీకి చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం తన సోదరుడ్ని కలవటానికి వెళ్లింది. అక్కడ ఆమె మాజీ ప్రియుడు జనాథన్ స్మిత్ ఆమెను ట్రక్‌లో ఎక్కించుకున్నాడు. తర్వాత ఆమెపై దాడి చేశాడు. ట్రక్నుంచి బయటకు పోవాలని చూస్తే స్క్రూడ్రైవర్‌తో చంపుతానని బెదిరించాడు. అక్కడినుంచి ఆమెను ట్వైస్ డైలీ గ్యాస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ లోపలికి వెళ్లారు. మాజీ ప్రియుడినుంచి తప్పించుకోవాలని భావించిన ఆమె ఓ ఉపాయం ఆలోచించింది. వెంటనే గ్యాస్ స్టేషన్ క్లర్క్‌కు టిక్‌టాక్ హ్యాండ్ సింబల్‌ను చూపించింది.
తన బొటన వేలును మడిచి మిగిలిన నాలుగు వేళ్లను దానిపై కప్పేసింది. టిక్‌టాక్ ప్రకారం దీని అర్థం ప్రమాదంలో ఉన్నాను.. రక్షించండి అని. అది అర్థం చేసుకున్న క్లర్క్ పోలీసులకు ఫోన్ చేశాడు. అంతేకాదు! వాళ్లు బయటకు పోకుండా ఆపటానికి ప్రయత్నించాడు. అయితే, అక్కడ ఏం జరుగుతోందో అర్థం చేసుకున్న జనాథన్ ఆమెతో అక్కడినుంచి వెళ్లిపోయాడు. పోలీసులు వాళ్లను వెంబడించారు. దాదాపు 15 నిమిషాల పాటు ఛేజింగ్ జరిగింది. చివరకు జనాథన్ను పట్టుకున్నారు. బాధితురాలిని క్షేమంగా ఇంటికి పంపించేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : డాక్టర్ కాదు కామ పిశాచి.. 48 మంది మహిళలపై లైంగిక దాడి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.