గత రెండేళ్లకు పైగా కంటికి కనిపించని కరోనా వైరస్ పురుగు ప్రపంచ మానవాళికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికి ఎంతో మంది కరోనాతో మరణించారు. అయితే కోవిడ్ చికిత్స కోసం దాదాపుగా అన్ని దేశాలు కష్టపడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజలకు అందుబాటులోకి కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ వ్యాక్సిన్ తో కోవిడ్ ప్రమాదబారి నుంచి కొంత మేరకు తప్పించుకునే వీలుంటుందని దీనిని ప్రజలకు అందుబాటులకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా వేసుకోవటంతో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే కరోనా వైరస్ చికిత్స కోసం ఏకంగా టాబ్లెట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
అమెరికన్ కంపెనీ మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ మొదటిసారిగా టాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కాగా ఈ మోల్నుపిరవిర్ టాబ్లెట్‌కు బ్రిటన్ మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ కూడా ఆమోదం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు ఇటీవల ఈ టాబ్లెట్ క్లినికల్ ట్రయల్స్ లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయట. మరీ అన్ని గనుక చకచక జరిగితే కోవిడ్ నివారణకు త్వరలో ప్రజలకు టాబ్లెట్ అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.