ఆకాశం నుంచి ఉన్నట్టుండి ఒక వస్తువు జారి పడింది. అతి పెద్ద వెలుగుతో అది భూమ్మీదకు చేరుకుంది. ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దేశం కాని దేశంలో మరణిస్తే మృతదేశం స్వదేశానికి రావాలంటే చాలా కష్టం. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. చివరి చూపు చూసే అవకాశం దక్కుతుందో లేదో అని తల్లిదండ్రులు అనుక్షణం బాధపడుతుంటారు. దెబ్బ తగిలితేనే కంగారుపడే తల్లిదండ్రులు బిడ్డ చనిపోతే చూడకుండా ఉండగలరా? ప్రస్తుతం సాయి తేజస్వి తల్లిదండ్రుల పరిస్థితి ఇదే.
విదేశాల్లో బాగా చదువుకుని, మంచిగా స్థిరపడి అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలని యువకులు విదేశాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ వివక్ష కారణంగానో, ప్రాంతీయ బేధాల కారణంగానో మన భారతీయులను బలి తీసుకున్న సంఘటనలను చూశాం. కొంతమంది అనారోగ్యంతో మరణించారు. ఇలా ఎన్నో ఆశలతో వెళ్లిన తమ పిల్లలు అందనంత ఎత్తుకు ఎదుగుతారనుకుంటే ఊహించని విధంగా అందుకోలేనంత ఎత్తుకు వెళ్లిపోతున్నారు. ఆ మధ్య ఖమ్మం యువకుడు, డాక్టర్ హర్షవర్ధన్ క్యాన్సర్ కారణంగా చనిపోయారు. అయితే చనిపోతానని ముందే తెలిసి తన మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసి అందరినీ కంటతడి పెట్టించారు. ఇప్పుడు మరో తెలుగు యువతి మరణం కన్నీళ్లు పెట్టిస్తుంది.
దేశం కాని దేశంలో మరణిస్తే మృతదేహం స్వదేశానికి తీసుకురావాలంటే కుటుంబ సభ్యులకు అదొక పెద్ద సవాలు. ప్రభుత్వ పెద్దల సహకారమో లేక ప్రముఖుల పరిచయాలు ఉంటేనే గానీ స్వదేశానికి తీసుకురావడం కష్టం. ఈ క్రమంలో తమ బిడ్డ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. కూతురి చివరి చూపు కోసం తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన సాయి తేజస్వి బ్రిటన్ లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తోంది. ఈ నెల 11న స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్ళింది. ఆ సమయంలో ఆమె గల్లంతయ్యింది. సమాచారం అందుకున్న అధికారులు ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడే ఓ ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని ఉంచారు.
ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ తమ వల్ల కాలేదు. దీంతో మృతురాలి సోదరి ప్రియారెడ్డి మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేయగా ఆయన స్పందించారు. అక్కడి అధికారులతో మాట్లాడి స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నాడు సాయి తేజస్వి మృతదేహం హైదరాబాద్ కు చేరుకోనుంది. ఆరోజే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కూతురు మరణించిన దాదాపు 10 రోజుల తర్వాత చివరి చూపులు దక్కనున్నాయి. కూతురు చివరి చూపు కోసం తల్లిదండ్రులు, ఆమె సోదరి, బంధువులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.