ప్రపంచంలో ప్రతిరోజూ అనేకమైన వింతలతో పాటు టెక్నాలజీని ఉపయోగించి విభిన్నమైన రూప కల్పనలు కూడా జరుగుతున్నాయి. మనిషి ఎంత కష్టంలో ఉన్నా చనిపోవాలని అనుకుంటే మాత్రం నొప్పి లేకుండా చావడం అనేది సాధ్యం కాదు. సూసైడ్ చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఊపిరి ఆగేలోపు నొప్పి భరించాల్సిందే. కానీ రోజురోజుకి సమాజంలో పుట్టుకలతో పాటు మరణాలు కూడా భారీ సంఖ్యలోనే జరుగుతున్నాయి. అందులోను సూసైడ్ మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి.
ఎవరైతే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారో వారికోసం ‘పెయిన్ లెస్ డెత్ మెషిన్'(నొప్పి లేకుండా చావును ప్రసాదించే యంత్రం)గా చెబుతున్నారు తయారీదారులు. ఇంతకీ ఈ యంత్రాన్ని ఏ దేశంలో ప్రవేశ పెట్టారనే సందేహం కలగవచ్చు. ఇలాంటి యంత్రం కూడా ఉందా? అని ఆశ్చర్యపోకండి. నిజమే.. ఇటీవలే స్విట్జర్లాండ్ దేశంలో ‘సాక్రో’ అనే పేరుతో ప్రవేశపెట్టారు. ఈ యంత్రాన్ని లీగల్ గా ఆ దేశ ప్రభుత్వం అంగీకారంతోనే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తయారీదారులు చెప్పడం విశేషం.
క్యాప్సూల్ ఆకారం కలిగిన ఈ సాక్రో యంత్రం.. ఒక నిమిషంలోపే నొప్పిలేకుండా, శాంతియుత మరణాన్ని ప్రసాదిస్తుంది. ఈ యంత్రం స్విట్జర్లాండ్‌లో చట్టపరమైన సమీక్షను క్లియర్ చేసింది. ఇందులో కీలకంగా ఆక్సిజన్ స్థాయిని తగ్గించడం ద్వారా హైపోక్సియా – హైపోకాప్నియా ద్వారా మరణం సంభవిస్తుందని పేర్కొన్నారు. ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్.. డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే ఈ సూసైడ్ ప్యాడ్ కనుగొన్నారు. దీన్ని డాక్టర్ డెత్ అని కూడా పిలుస్తున్నారు. మరి ఎందుకు ఈ యంత్రం వైతయారు చేసారు? అంటే.. ఎగ్జిట్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, స్విట్జర్లాండ్‌లో గత సంవత్సరం ఇలాంటి ‘సూసైడ్ సహాయక’ యంత్రం ఉపయోగించి సుమారు 1,300 మంది మరణించారని సమాచారం. ఈ యంత్రం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.