సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక్క ఇండియాలోనే కాదు. జపాన్, మలేషియా లాంటి ప్రాంతాల్లో కూడా తన సినిమాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఎంత మార్కెట్ ఉంటుందో? అంతే మార్కెట్ జపాన్‍లో ఉంటుంది రజినీకాంత్‌కి. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా ఆయనకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సౌత్ లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాగే విదేశాల్లోనూ రజినీకాంత్ కు వీరాభిమానులు ఉన్నారు.
ముత్తు సినిమా నుంచి జపాన్లో రజినీకాంత్ ఫాలోయింగ్ పెరిగి పోయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా జపాన్ లో కూడా విడుదల అవుతూ ఉంటుంది. ఆయన సినిమాలకు అక్కడ కలెక్షన్స్ భారీగా వస్తుంటాయి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ హిట్ కావడం. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్ సినిమా ఇక్కడ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా నివేదాథామస్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాను జపాన్ లో విడుదల చేశారు. అక్కడ ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. జపాన్లోని ఎంకేసీ ప్లెక్స్ లో దర్బార్ సినిమాను జపనీస్ వెర్షన్లలో విడుదల చేశారు. అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీస్థాయిలో స్పందన వస్తోంది. వయసు పెరుగుతున్నా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటడం రజినీకే చెల్లింది.
తెలుగు హీరోలలో ఎన్టీఆర్ కు కూడా జపాన్లో భారీ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ కూడా ఇప్పుడిప్పుడే అక్కడ సత్తా చాటుతున్నాడు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయితే ఈ ఇద్దరు హీరోలకు అక్కడ భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మరోసారి దర్భార్ సినిమాతో క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
‘దర్బార్’లో రజినీకాంత్ తో పాటు నయనతార, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ప్రస్తుతం రజినీకాంత్ “అన్నాత్తే” సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.