సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సమాజంలో గుర్తింపు పొందుతున్నారు. వారికున్న ప్రతిభతో రకరకాల వీడియోలు చేస్తూ ఫేమస్ అయిపోతున్నారు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో చేసే కొన్ని రకాల పనులు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.
కొంతమంది ప్రాంక్ వీడియోల పేరుతో జనాలను భయపెట్టడం, పబ్లిక్ ప్లేస్ లో ఇబ్బందికరంగా ప్రవర్తించడం వంటి పనులతో జనాగ్రహానికి గురైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇదే తరహాలో ఓ బాలుడు చేసిన అల్లరి పని వందల కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ బాలుడు చేసిన అల్లరి పని ఏంటి? ఎందుకు అలా చేశాడు? అనే వివరాలు తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మనిషి జీవన విధానం మారిపోయింది. క్షణం కూడా స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండలేక పోతున్నారు. అయితే దీనిని ఉపయోగించడం వల్ల లాభాలున్నాయి, నష్టాలున్నాయి. కొందరు యూట్యూబ్ వీడియోలు చేసి ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు. అయితే ఇలాగే ఓ బాలుడు రెస్టారెంట్ కు వెళ్లి ప్రాంక్ వీడియో కోసం ఓ అల్లరి పని చేశాడు. దీంతో ఆ రెస్టారెంట్ వందల కోట్ల నష్టాన్ని చవిచూసింది. వివరాల్లోకి వెళ్తే.. జపాన్ లోని సుషీ రెస్టారెంట్ కు ఓ బాలుడు వెళ్లాడు. అక్కడ ఓ టేబుల్ దగ్గర కూర్చోని పక్కనే ఉన్న సాస్ బాటిల్ తీసుకున్నాడు.
బాటిల్ ను ఓపెన్ చేసి అందులోని సాస్ ను నాకి ఏమీ ఎరగనట్టుగా ఆ సాస్ బాటిల్ ను టేబుల్ పై పెట్టాడు. ఆ తరువాత టీ కప్పులను తీసుకుని వాటిని నాలుకతో తాకుతూ ఉమ్మిని పూసాడు. ఇంతటితో ఆగకుండా నోట్లో వేలు పెట్టుకుని అక్కడున్నటువంటి తినుబండారాలను అదే వేలితో ముట్టుకున్నాడు. ఆ అబ్బాయి సీక్రెట్ గా ఆ పనులు చేస్తున్న సమయంలో రెస్టారెంట్ సిబ్బంది వారి వారి పనుల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో ఆ రెస్టారెంట్ కు వచ్చిన మరో కస్టమర్ ఆ బాలుడు చేసిన ఆ పనులన్నింటిని వీడియో తీశాడు. తరువాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇంకేముంది నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో సుషీ రెస్టారెంట్ లో అమ్మకాలన్నీ పడిపోయి ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది. ఏకంగా రూ. 946 కోట్ల నష్టం వచ్చింది. దీంతో ఆ రెస్టారెంట్ ఆ బాలుడిపై రూ. 3.95 కోట్ల దావా వేసింది. రెస్టారెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ బాలుడు తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ప్రాంక్ వీడియో కోసమే ఇలా చేశానని కోర్టుకు తెలిపాడు. తనపై వేసిన దావాను కొట్టివేయాలని కోర్టుకు ప్రాధేయపడ్డాడు.
🇯🇵 FLASH – Le "terrorisme du sushi" fait fureur au #Japon : des adolescents s’amusent à se filmer en train de lécher la vaisselle ou jouer avec la nourriture, dans des restaurants de #sushis servis sur tapis roulant. (HuffPost) #sushiterrorism #sushiterro pic.twitter.com/Wlpm0JlGj6
— Mediavenir (@Mediavenir) February 4, 2023