ఈ రోజుల్లో డబ్బులతో కొనలేనిది ఏదీ లేదు. ‘డబ్బుంటే సుబ్బిగాడిని..సుబ్బారావుగారంటారు’అని ఓ సినీ కవి అన్నట్లు.. పైసామే పరమాత్మ హై. అయితే అన్ని వస్తువులను పూర్తిగా డబ్బుతో వశం చేసుకోలేకపోయినప్పటికీ.. కొన్నింటిని అద్దె ప్రాతిపాదికన కొనుగోలు చేస్తున్నారు.
ఈ రోజుల్లో డబ్బులతో కొనలేనిది ఏదీ లేదు. ‘డబ్బుంటే సుబ్బిగాడిని..సుబ్బారావుగారంటారు’అని ఓ సినీ కవి అన్నట్లు.. పైసామే పరమాత్మ హై. అయితే అన్ని వస్తువులను దుడ్డుతో పూర్తిగా వశం చేసుకోలేకపోయినప్పటికీ.. కొన్నింటిని అద్దె ప్రాతిపాదికన కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణలకు ఇల్లు అద్దెకు తీసుకుంటాం. అలాగే వాహనాలు అద్దెకు ఇస్తారు. ఇప్పుడు కొన్ని వస్తువులు, దుస్తులు, ఆభరణాలు కూడా అద్దెకు దొరకుతున్నాయి. ఇప్పుడు ఇదొక నయా బిజినెస్ అయిపోయింది. ఖరీదైన వాటిని కొనుగోలు చేయలేనప్పుడు రెంట్ ప్రాసెస్‌పై ఆధారపడుతున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే అద్దె మాత్రం కాస్తంత వింతైనదే, చెబితే నోరెళ్ల బెట్టకమానదు కూడా. ఇంతకు ఏంటీ ఆ అద్దె అనుకుంటున్నారా..? చెబుతానండీ.
మీ బాధలు, ఆనందాన్ని పంచుకోవడానికి బెస్టీలంటూ ఎవ్వరూ లేరా. మీ రహస్యాలను షేర్ చేసుకునే లవర్ ఎట్ లీస్ట్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేరని బాధపడిపోతున్నారా. అయితే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అద్దెకు ఇస్తున్నారట. ఆ అడ్రస్ పెట్టు అని కామెంట్ చేయకండి.. ఆ అవకాశం ఇక్కడనుకుంటున్నారేమో.. ఆశ, దోశ, అప్పడం, వడ.. ఇక్కడ కాదండీ..జపాన్‌లో. చాలా మంది అవివాహితుల్లో పెరుగుతున్న ఒంటరితనానికి ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు వెబ్ సైట్లను రూపొందించింది. దీని ద్వారా అద్దె ప్రాతిపదికన బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తీసుకోవచ్చు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునేవారు గంటకు రూ. 3000 వేలను చెల్లించాల్సి ఉంటుంది. మినిమం రెండు గంటల పాటు అద్దెకు తీసుకోవాల్సిందే.
అయితే మీరు ఎంచుకునే అమ్మాయి కావాలనుకుంటే.. అదనంగా రూ. 1200 చెల్లించాలి. తొలిసారి మాత్రం ఉచితమే. అయితే గర్ల్ ఫ్రెండ్ ఎంచుకునేటప్పుడు ఛార్జీలతో పాటు కొన్ని నియమాలను కూడా కస్టమర్లు పాటించాల్సి ఉంటుంది. అద్దెకు తీసుకున్న గర్ల్ ఫ్రెండ్ కు నేరుగా సంప్రదించడానికి అనుమతి లేదు. అంతేకాకుండా ఖరీదైన బహుమతులు ఇవ్వరాదు. అదేవిధంగా బాయ్ ఫ్రెండ్ కావాలనుకునే అమ్మాయిలు కూడా అద్దె ప్రాతిపదికన పురుషులను అందించే కంపెనీలు, వెబ్ సైట్లను సంప్రదించి తీసుకోవచ్చు. బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ని అద్దెకు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.