ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. తినడానికి తిండిలేక ప్రజలు పస్తులుండాల్సిన దుస్థితి. ఇప్పుడు అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమల్లో పనిచేసే మహిళలు.. ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
కుటుంబ పోషణ, ఆకలి కేకలతో మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. ఇంట్లోకి సామాన్ల కోసం దుకాణదారులకు ఒళ్లు అమ్ముకుంటున్న దీనస్థితిని అనుభవిస్తున్నారు. ‘ఒకప్పుడు ఏదో పనిచేసుకుని బతికేవాళ్లం. మా ఉపాధి పోయింది. కడుపు నిండాలంటే డబ్బు కావాలి. మేం చేసేది తప్పే కావచ్చు కానీ తప్పడం లేదు’ అని మహిళలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. శ్రీలంక మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా దేశంలో సెక్స్ వర్కర్ల సంఖ్య 30 శాతం పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా.. వస్త్రపరిశ్రమ రంగంలో పనిచేసిన మహిళలు ఎక్కువుగా ఈ వృత్తిలోకి దిగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఉద్యోగం పోతుందనే భయంతో గత్యంతరం లేకే తాము ఈ ఊబిలోకి దిగుతున్నట్లు మహిళలు పేర్కొంటున్నారు. ఉద్యోగం చేస్తే తమకు నెలకు రూ.25,000 నుంచి 30,000వరకు మాత్రమే వచ్చేదని, కానీ వ్యభిచారంలో రోజుకు రూ.15,000 సంపాదిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Ranil Wickreme Singhe: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే..
ఇది కూడా చదవండి: భర్త శృంగార కోరికలు తీర్చేందుకు భార్య సరికొత్త ఉపాయం!