అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు చేస్తున్న అరాచకాలను యావత్ ప్రపంచమంతా చుస్తోంది. అధికారం కోసం 20 ఏళ్లుగా ఎదురుచూసిన తాలిబన్లు గత 10 రోజుల్లోగా అఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దెబ్బకు ఆ దేశ ప్రధాని అప్రఫ్ ఘనీ దేశం నుంచి విదేశాలకు పారిపాయారు. దీంతో అక్కడి ప్రజలు వీరి పరిపాలనను ఊహించుకోలేక విదేశాలకు తరలిపోతున్నారు. ఇక దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న తాలిబన్లు షరియా చట్టలు అమలవుతాయేమోనని ప్రజలు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
ఇక అఫ్ఘనిస్తాన్ రాజధాని అయిన కాబుల్ మినిహ అన్ని ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో రాజధాని కాబుల్ మాత్రం అమెరికా సైన్యంలో ఉంది. ఇదే అదును చేసుకుని అక్కడి ప్రజలంతా కాబుల్ విమానాశ్రయం నుంచి ఇతర దేశాల పారిపోయేందుకు విచ్చలవిడిగా చేరుకుంటున్నారు. ఇక ఇక్కడ కనిపిస్తున్న భయనక పరిస్థితులు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే తాలిబన్లు ఇంతటితో ఆగకుండా వారు ఆ దేశ అధ్యక్ష భవనంలోకి సైతం అడుగుపెట్టారు. అందులో వారు తుపాలు పట్టుకుని భవనంలో వెళ్లి నానా హంగామా చేస్తున్నారు.
ఇక తాలిబన్లు చేస్తున్న అరాచకాలపై వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. దీంతో ట్విట్టర్ లో స్పందించిన ఆయన వారు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టే ప్రయత్నం చేశాడు. ఏకంగా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించటమే కాకుండా అందులోకి ప్రవేశించి ఇష్టమైన ఫుడ్ తింటూ తెగ ఎంజాయ్ చేస్తున్న వీడియోను వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాలిబన్ల తీరు చూడండి, వారు జంతువులనేది స్పష్టంగా అర్దమవుతోంది, ఇది నిజం తాలిబన్లు జస్ట్ కిడ్స్ అంటూ అంటూ పోస్ట్ పెట్టాడు.
U can see what kind of animals the taliban are just by how they are eating food in the Presidential palace pic.twitter.com/lSXb9uyhsJ
— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2021