ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయని హసీబా నూరి దారుణ హత్యకు గురయ్యారు. పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఈ మధ్య చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో సినీ వర్గాల వారు ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ పాపులర్ సింగర్ దుండగుల కాల్పుల్లో మరణించారని తెలియడంతో సినీ, టీవీ రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాయాది దేశమైన పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయని హసీబా నూరి దారుణ హత్యకు గురయ్యారు. పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఓ ఛానెల్ పేర్కొంది. ఈ ఘటనపై పాకిస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సింగర్ హసీబా నూరి మరణాన్ని ఆమె స్నేహితుడు ఖోస్బో అహ్మదీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ ఘటనపై ‘మలాలా యూసఫ్ జాయ్’ తండ్రి ‘జియావుద్దీన్ యూసఫ్ జాయ్’ ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీన పరచుకున్న తర్వాత హసీబా, పాక్‌లో తలదాచుకుంటున్నారు. శరణార్థిగా ఆశ్రయం పొంది, మళ్లీ తన సింగింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె ప్రధానంగా సాంప్రదాయ జానపద పాటలకు ప్రసిద్ధి చెందారు. హసీబాకు ఆఫ్ఘాన్‌లో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అక్కడ పలు ఛానెళ్లల్లో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారామె. ‘మినా’, ‘సబ్జా’, ‘జనమ్’, ‘అల యారం’ వంటి పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబాన్లు వశపరచుకోగా.. హసీబా నూరితో సహా ఇతర కళాకారులు పాక్‌లో శరణార్థులుగా ఉంటున్నారు.
Deeply saddened to know that some extremists have brutally assassinated Fam. 🇦🇫i singer #Hasiba_Noori in Peshawar! She had moved to 🇵🇰 (to seek protection) after the fall of Kabul to continue her career. Strange that v prefer guns over music!
Long live music!#Hasiba_Noori pic.twitter.com/lfQZXb9uWn— Yasir Manan Khattak (@aesthete_says) July 17, 2023