కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతో మందిని ఇబ్బందుల పాలు చేయవచ్చు. అంతేకాకుండా ఆ నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాలు చివరకు వారి మెడకే చుట్టుకోవచ్చు. అలా ఓ ఆరోగ్య శాఖా మంత్రి తీసుకున్న నిర్ణయంతో ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన వల్ల చివరకు ఆరోగ్య శాఖా మంత్రి రాజీనామా చేసే వరకు వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. పోర్చుగల్ లోని లిస్బన్ లోని ప్రధాన ఆస్పత్రిలో ప్రసూతి సేవలు లేవు. దాంతో భారతదేశానికి చెందిన ఓ గర్భిణిని అంబులెన్సులో వేరే ఆస్పత్రికి తరలిస్తున్నారు. అదే సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనతో అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడోపై వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే అత్యవసర ప్రసూతి ఆస్పత్రులను తాత్కాలికంగా మూసివేయాలని ఆమె తీసుకున్న ఒక నిర్ణయమే ఇప్పుడు గర్భిణి మృతికి కారణం అయ్యిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
గతేడాది సమ్మర్ వెకేషన్ టైమ్ లో సరిపడా వైద్యులు లేక అత్యవసర ప్రసూతి సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఆ నిర్ణయంపై చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. గత్యంతరం లేకనే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు టెమిడో చెప్పినా వినే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ నిర్ణయం కారణంగానే ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోవడంతో రాజీనామా చేయక తప్పలేదు. పోర్చుగల్ ప్రధాని ఆమె రాజీనామాను ఆమోదించడమే కాకుండా.. ఆమెకు ధన్యవాదాలు తెలపడం గమనార్హం. టెమిడో నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Health Minister Marta Temido of Portugal resigned on Tuesday.#healthminister #Portugal #MartaTemido #worldnews
Read here: https://t.co/PP86Iqttvq pic.twitter.com/y5J7nleTKu— Daily Times (@dailytimespak) September 1, 2022