నియంత్రత్వ పాలనకు పెట్టింది పేరుగా నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్‌ను చెప్పుకుంటారు. ప్రజలు ఏం చేయాలో, ఏం చేయకూడదో ప్రతిదీ శాసించే డిక్టేటర్‌గా ఆయన్ను పిలుస్తుంటారు. అలాంటి కిమ్ ఇప్పుడు మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని వారుండరు. నియంత్రత్వంతో కూడిన పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా కిమ్‌ను చెప్పుకుంటారు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు.. ఇలా ప్రతిదీ సంచలనమే. కిమ్ విధించే శిక్షల గురించి కూడా అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. తన మాటే శాసనమనేలా ఆయన వ్యవహరిస్తుంటారు. ప్రజలు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో కూడా ఆయన డిసైడ్ చేస్తారు. ఆఖరుకు ఎలాంటి హెయిర్ స్టయిల్స్ వేసుకోవాలో కూడా నిర్ణయించే డిక్టేటర్‌గా కిమ్‌ను చెప్పుకోవచ్చు. తన మాట మీరితే కఠినమైన శిక్షలు వేస్తుంటారు. అణుబాంబుల తయారీ, మిస్సైళ్ల ప్రయోగాలతో శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కిమ్ జాంగ్.. తాజాగా తన దేశ ప్రజలకు మరో హుకుం జారీ చేశారు.
కిమ్ జాంగ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. రెండో కూతురి పేరు జు-యే. అయితే ఆమె పేరు మరెవ్వరికీ ఉండకూడదని కిమ్ తాజాగా ఓ హుకుం జారీ చేశారు. తన కూతురి పేరు మరెవరూ పెట్టుకోకూడదని.. ఇప్పటికే ఆ పేర్లు ఉన్నవాళ్లు దానిని మార్చుకోవాలని ఆదేశించారు. వారి బర్త్ సర్టిఫికేట్లు, అలాగే ఇతర ధృవీకరణ పత్రాల్లోనూ మార్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఆ పేరు ఉన్నవాళ్లు వణికిపోతున్నారు. ఇన్నాళ్లూ ఆ పేరుతో అందరికీ పరిచయమైన తాము కొత్త పేరు పెట్టుకోలేక సతమతమవుతున్నారు. ఒకవేళ పేరు మార్చుకోకపోతే ఎలాంటి శిక్షలు విధిస్తారేమోనని భయపడుతున్నారు.
ఇకపోతే, ఉత్తర కొరియాకు కాబోయే అధినేత్రిగా కిమ్ కూతురు జు-యే పేరు వినిపిస్తోంది. పదేళ్ల తన గారాలపట్టికి అధికార పగ్గాలు అప్పజెప్పాలని కిమ్ అనుకుంటున్నట్లుగా ఆ దేశ మీడియా కూడా ఇన్‌డైరెక్టుగా ప్రచారం చేస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ కుటుంబమంటే.. మొన్నటివరకు అంతా ఓ రహస్యం. బయటి ప్రపంచానికి తన ఫ్యామిలీని ఆయన ఎప్పుడూ దూరంగా పెడుతూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో తన కూతురితో కనిపిస్తూ అందర్నీ కిమ్ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ఆర్మీ పరేడ్‌కు కూడా వారసురాలితోనే ఆయన హాజరయ్యారు. దీంతో ఆ అమ్మాయే.. కాబోయే ఉత్తర కొరియా అధినేత్రి అనే ప్రచారం మొదలైంది. కిమ్ తన రెండో కూతుర్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తుండటంతో ఆమెకు అధికార పగ్గాలు కట్టబెడతారనే చర్చ సాగుతోంది. మరి, నియంతృత్వ పోకడలకు అద్దం పట్టే కిమ్ తాజా హుకుంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kim Jong Un’s daughter was seen marching alongside him at a military parade this week. The girl has not been named in state media, but South Korean intelligence officials believe she is Kim’s daughter identified as Ju Ae https://t.co/4oTLuEdHC6 pic.twitter.com/JuGtRdZyUl
— Reuters (@Reuters) February 9, 2023