ఏ పనీ చేయకపోయినా కూడా జీతం ఇస్తారా? నీ కంటికి మరీ అంత ఎ*వలా కనబడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనబడట్లేదా అని మనసులో బ్రహ్మానందం డవిలాగ్ వేసుకున్నా గానీ అదే నిజం. ఏ ఎ*వ కాదండి బాబూ.. ఏ పనీ చేయకపోయినా కూడా కోటిన్నరకు పైగా జీతం ఇచ్చిందని ఒక యువతి వెల్లడించింది. ఇది నిజం.
గొడ్డులా కష్టపడి పని చేస్తేనే జీతం సరిగా ఇవ్వని కంపెనీలు ఉన్న ఈరోజుల్లో ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చున్నందుకు జీతం ఇస్తారా? అది కూడా 20 వేలో, 30 వేలో కాదు, ఏకంగా కోటిన్నర. ఇదెక్కడి మాస్ రా మావ అని అనిపించినా ఇదే నిజం. మరీ ఖాళీగా ఉన్న వాళ్లకి కోట్లు జీతం ఇచ్చిన మెట్ట కంపెనీ ఏంటో అని అనుకుంటున్నారా? ఆ కంపెనీ మరేదో కాదు, ‘మేము జీతాలివ్వలేం బాబోయ్’ అని వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్న మెటా సంస్థ. అవును ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా ఆర్థిక మాంద్యాన్ని భరించలేం బాబోయ్, జీతాలు చెల్లించలేం బాబోయ్ అని వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు సోషల్ మీడియాలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు.
మెటా మాజీ ఉద్యోగిని తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నందుకు నెలకు కోటిన్నర జీతం ఇచ్చేవారని వెల్లడించింది. టిక్ టాక్ లో చేసిన వీడియో ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆమె పేరు మాడలిన్ మచాడో. సెప్టెంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకూ మెటా సంస్థలో హెచ్ఆర్ రిక్రూటింగ్ విభాగంలో పని చేసింది. అయితే ఆ సమయంలో తనకు ఎలాంటి పని ఉండేది కాదని, హెచ్ఆర్ రిక్రూటింగ్ విభాగంలో ఖాళీగా ఉండేవారమని ఆమె తెలిపింది. కంపెనీలో చేరిన కొన్ని రోజులకే బాస్ వచ్చి ఏమీ చేయవద్దని చెప్పారని, ఆరు నెలలు ఎలాంటి నియామకాలు జరపవద్దని ఆదేశించారని ఆమె వెల్లడించింది. ఇలా చెప్పడంతో తనకు ఆశ్చర్యం వేసిందని.. ఖాళీగా ఉన్నందుకు 1,90,000 డాలర్లు (రూ. 1.50 కోట్లు) జీతం ఇస్తున్నారా? అని అనిపించిందని ఆమె పేర్కొంది.
కంపెనీలో చేరినాక 6 నెలల పాటు ఏ పనీ చేయలేదని ఆమె తెలిపింది. బాగా నేర్చుకోవడం, అభ్యసించడం ఒక్కటే చేయమని పై అధికారులు చెప్పేవారని ఆమె పేర్కొంది. తన టీమ్ లోని అందరి పరిస్థితి ఇదేనని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె చేసిన ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలా మంది ఆమెపై విమర్శలు చేశారు. ఆమె ఒక బద్ధకస్తురాలు అని, కెరీర్ తో చెలగాటం ఆడుతున్నావంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆమె మరో వీడియో చేసి క్లారిటీ ఇచ్చింది. తన ఉద్దేశం అది కాదని.. జాబ్ లో చేరిన తర్వాత 6 నెలల పాటు నేర్చుకున్నానని, తమ పై అధికారులే మొత్తం చూసుకునేవారని తెలిపింది. అయితే ఇలా ఖాళీగా ఉన్నందుకు మెటా సంస్థ కోటిన్నర జీతం ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
this is why everyone in tech is getting laid off & why the tiktok girls were able to make such exquisite day in the life of a tech employee videos. pic.twitter.com/IoeGoxBd4I
— noisé (@proetrie) March 21, 2023