బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బోరిస్ జాన్సన్ వారసురాలిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. ఇండియన్ ఆరిజన్ లీడర్ రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో.. పార్టీ నేతను ఎన్నుకునే క్రమంలో భారీ కసరత్తు జరిగింది. ముందు నుంచి రిషి సునాక్ ప్రధాని రేసులో ఉంటూ సంచలనం సృష్టించారు.
బ్రిటిష్ మాజీ అర్థికమంత్రి అయిన 42 ఏళ్ల రిషి సునాక్.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నారాయణమూర్తికి స్వయంగా అల్లుడు. పది పాయింట్ల అజెండాతో ఎన్నికల ప్రచారం చేసిన రిషి సునాక్ అక్రమ వలసలు అరికడతానని, నేరాలను అదుపుచేసి యూకే వీధులను సురక్షితంగా మార్చుతానని, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు తగిన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇవేమి ఆయనకు గెలిపించలేకపోయాయి.
Liz Truss wins Conservative party race, set to become new British PM
Read @ANI Story | https://t.co/rRIGmZVPxl#UKPMRace #UKPM #LizTruss #RishiSunak pic.twitter.com/SBBtaJ4q04
— ANI Digital (@ani_digital) September 5, 2022