బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్త గారు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి కేరళలోని ఓ దేవాలయంలో దేవుడికి నైవేద్యం వండారు. అందరిలానే సాధారణ గృహిణిలా ఆమె కట్టెల పొయ్యి మీద ప్రసాదం వండి దేవుడికి నైవేద్యం పెట్టారు. అయితే దీన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు.
కొంతమంది ఎన్ని వేల కోట్లు ఆస్తి ఉన్నా చాలా సాధారణంగా ఉంటారు. ఆమె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగారు. అయితేనేం చాలా సింపుల్ గా ఉంటారు. గుడిలో దేవుడికి స్వయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం వండి సమర్పించారు. మిగతా భక్తులలానే తాను కూడా సాధారణ భక్తురాలిగా గుడి బయట రోడ్డు మీద కూర్చుని పాయసం వండి నైవేద్యాన్ని సమర్పించి భక్తి చాటుకున్నారు.
దేశం మెచ్చిన నాయకుడు.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న దేశాధినేత.. భారత్‌కు కొత్త దిశానిర్దేశం.. ప్రపంచానికి మార్గదర్శనం.. ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్.. ఇవి ప్రపంచ నలుమూలలా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురుంచి వినపడుతున్న మాటలు. ఇవి మన దేశ పౌరులు అంగీకరించకపోయినా.. ప్రపంచం మాత్రం ఇదే నిజమంటోంది. అవును.. అత్యధిక జనామోదం పొందిన ప్రపంచ దేశాధినేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. 22 మంది దేశాధినేతలతో రూపొందించిన జాబితాలో మోదీ నంబర్ 1గా నిలిచారు. అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ […]
ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తే.. మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని పాలిస్తున్నారు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యాక వినిపిస్తున్న మాట ఇదే. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 200 ఏళ్లు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు సింహాసనాన్ని మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అధిష్టించారు. విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో. కర్మ రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదేనేమో. అయితే […]
భారతదేశ చరిత్రలోనే కాక.. ప్రపంచ చరిత్రలో కూడా కోహినూర్ వజ్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వజ్రం కోసం యుద్ధాలు.. భారీ ఎత్తున రక్తపాతం జరిగింది. చారిత్రక నేపథ్యమే కాక భారీ విలువ కలిగిన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాజవంశం దగ్గర ఉంది. రాణి ధరించే కిరీటంలో చిక్కుకుపోయింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కోహినూర్ వజ్రం ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. మనవాడే ప్రధాని […]
రిషి సునాక్ అంటే ఇప్పుడు తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రిటన్ ప్రధానిగా ఎంపికై ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఇంతటి ఘన విజయానికి కారణం తన భార్యే అని, ప్రధాని రేసులో ఉన్న సమయంలో తనను ఎంతగానో ప్రోత్సహించారని అక్షత గురించి ప్రధానిగా ఎంపికైన క్షణాన ప్రసంగంలో వెల్లడించారు. దీంతో అక్షత ఎవరు అని అందరూ వెతకడం మొదలుపెట్టారు. ఆమె మరెవరో కాదు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణమూర్తి కూతురు. […]
రిషి సునాక్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఈయన ఒక హీరో. ఎందుకో మీకు తెలుసు. బ్రిటన్ దేశానికి ఆయనిప్పుడు ప్రధాని. భారతీయ మూలాలు ఉన్నటువంటి హిందూ వ్యక్తి రిషి సునాక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఒక్కసారిగా ట్రెండింగ్ అయిపోయారు. ఎంతలా అంటే రిషి సునాక్ కులం ఏమిటి? అని గూగుల్ లో తెగ సెర్చ్ చేసేంత. ఈయన భారతదేశంలో పుట్టనప్పటికీ, ఆయన పూర్వీకులు మాత్రం ఇక్కడే […]
బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి.. ఈ సామెత అందరికీ తెలిసిందే. భారత దేశాన్ని రెండు వందల ఏళ్లకు పైగా పరిపాలించి.. ఇక్కడ సంపద అందా దోచుకు వెళ్లిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు భారతీయుడు పరిపాలించబోతున్నాడు. బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అద్బుతం సృష్టించాడు.. అతడే రిషి సునాక్. అతి పిన్న వయసులో బ్రిటన్ ప్రధానిగా ఏక గ్రీవంగా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా […]
భారత మూలాలున్న రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు 200 సంవత్సరాల పాటు ఏకధాటిగా మనల్ని పాలించిన దేశానికి నేడు.. భారత సంతతి వ్యక్తి ప్రధాని కావడం పట్ల భారతీయుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎవరైనా ఊహించారా.. జీవితం అంటేనే ఇది.. ఊహించని అద్భుతాలు అనేకం చోటు చేసుకుంటాయి అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇక రిషి సునాక్ బ్రిటన్ […]
బ్రిటన్.. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగి.. ప్రపంచ దేశాలన్నింటిని పాలించింది.. శాసించింది. ఇక భారతదేశాన్ని సుమారు 200 ఏళ్ల పాటు పాలించింది. ఒకప్పుడు భారతీయులు అంటేనే చాలా చిన్నచూపు, చులకన భావం కలిగిన దేశానికి నేడు.. అదే భారతీయ మూలాలున్న ఓ హిందూ వ్యక్తి ప్రధానిగా ఎన్నికవ్వడం ఎంతటి విచిత్రమో కదా. దీపావళి పండుగ రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రిషి సునాక్ ప్రస్థానం […]