సంగీత ప్రపంచంలో మరో లెజెండరీ గాత్రం మూగబోయింది. ప్రముఖ గాయని లాషున్ పేస్. ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న లాషున్.. సోమవారం మెట్రో అట్లాంటా హాస్పిటల్ లో మరణించినట్లు ఆమె కుటుంబీకులు తెలియజేశారు. 60 సంవత్సరాల వయసులోనే లాషున్ కన్నుమూయడంతో అమెరికన్ గాస్పెల్(సువార్త) సాంగ్స్ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. లెజెండరీ అయిన లాషున్ మరణంతో గాస్పెల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
సువార్త గాయనిగా, గేయరచయిత్రిగా గుర్తింపు సంపాదించుకున్న లాషున్.. ప్రఖ్యాత అట్లాంటా సువార్త సిస్టర్స్ లో ఒకరు. 1961లో అట్లాంటాలోని పూలే క్రీక్ కమ్యూనిటీలో లాషున్ జన్మించింది. తొమ్మిది మంది సిస్టర్స్ తో నెలకొల్పిన అట్లాంటా సువార్త చర్చి అభివృద్ధితో పాటు స్థానికంగా టాలెంట్ ను ప్రోత్సహించడంలో లాషున్ ముఖ్యపాత్ర పోషించింది. లాషున్ గాస్పెల్ సింగర్స్ బృందం పాపులర్ గ్రామీ అవార్డులకు నామినేట్ అవ్వడం విశేషం.
ఇక గాస్పెల్ పాడిన పాటలలో “ఐ నో ఐ హావ్ బీన్ చేంజ్డ్”, “యాక్ట్ లైక్ యు నో” పాటలు ఆమెకు సూపర్ ఫేమ్ తీసుకొచ్చాయి. లాషున్ 1996లో పాడిన ‘యాక్ట్ లైక్ యు నో’ సాంగ్.. ఇటీవల టిక్‌టాక్ రీల్స్ లో ట్రెండ్ గా మారింది. ప్రస్తుతం లాషున్ మరణాన్ని గాస్పెల్ సాంగ్స్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మరి గాస్పెల్ లెజెండరీ గాయని లాషున్ పేస్ మృతిపట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
BREAKING: The TRAILBLAZER of the legendary Gospel group, ‘The Anointed Pace Sisters,’ LaShun Pace, died this morning. Her sister Lydia Pace tells me that she passed away in a Metro Atlanta hospital from organ failure; she had been on kidney dialysis for 5 years 🙏🏽💔 pic.twitter.com/T7B5smVG6Y
— Shiba Russell (@ShibaRussell) March 21, 2022