పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటిఅంటూ బైడెన్ వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యం అమెరికాలో సత్సంబంధాలు ఏర్పరుచుకుని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుదామని భావిస్తున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు.. బైడెన్ వ్యాఖ్యలతో గొంతులో వెలక్కాయ పడినట్లు అయ్యింది. ఇతర దేశాలతో సమన్వయం లేకుండా స్వతంత్రంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను కలిగి ఉందన్నారు. ఆ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశంలో జో బైడెన్ పాకిస్తాన్ ను ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చైనా, రష్యా దేశాలతో అమెరికా విదేశాంగ విధానాల గరించి ప్రస్తావిస్తున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ తీరును తప్పుబట్టారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ తో అమెరికా 45 కోట్ల డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఎఫ్-16 యుద్ధ విమానాల మరమ్మతులు, ఇంజిన్ హార్డ్ వేర్ అప్ గ్రేడ్, స్పేర్ పార్ట్స్ సరఫరా, టెక్నాలజీ సపోర్ట్ వంటి అంశాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని భారత్ తప్పుబట్టింది. అయితే వారి చర్యను అగ్రరాజ్యం సమర్థించుకుంటోంది. ఉగ్రవాదం మీద పోరులో భాగంగానే పాకిస్తాన్ ఈ సహాయం చేస్తున్నట్లు అమెరికా చెప్పుకుంటోంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటి అనడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
“One of the most dangerous nations in world…” US President Biden’s candid comment on Pakistan
Read @ANI Story | https://t.co/slHvXQuziv#US #Pakistan #JoeBiden #Dangerouscountrypakistan pic.twitter.com/BczYrUNqRU
— ANI Digital (@ani_digital) October 15, 2022
ఇటీవలే జాతీయ భద్రతా వ్యూహం2022 విడుదల చేసిన అమెరికా.. చైనా, రష్యా దేశాలతో తమకు ఉన్న ముప్పు గురించి ప్రస్తావించింది. అలాగే వాటిని ఎలా ఎదుర్కోవాలో విధానాల గురించి చర్చించారు. అయితే ఆ నివేదికలో ఎక్కడా పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు. ఆ ప్రణాళిక బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే పాకిస్తాన్ ను జో బైడెన్ ప్రమాదకర దేశంగా అభివర్ణించడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది. ఈ సందర్భంగానే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, దాని ప్రభావం ప్రపంచ దేశాలపై ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా తాము నిర్వహిస్తున్న దౌత్య సంబంధాల గురించి చర్చిస్తూ.. చైనా, రష్యా, పాకిస్తాన్ దేశాలతో తమ సంబంధాల గురించి కూడా చెప్పుకొచ్చారు. 1988 నుంచి పాకిస్తాన్ అణ్వాయుధాల ప్రయోగం జరుపుతోందన్నారు. ఈ చర్యపై పశ్చిమ దేశాలు ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయని జో బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు పాక్‌ని అత్యంత ప్రమాదకర దేశం అనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
“What I think is maybe one of the most dangerous nations in the world, Pakistan. Nuclear weapons without any cohesion”, said US President Joe Biden at Democratic Congressional Campaign Committee Reception pic.twitter.com/cshFV5GVHY
— ANI (@ANI) October 15, 2022