ధాయిలాండ్ లో కీటకాల్ని తింటారని మనం అనుకుంటాం వీడియోలో చూస్తాం. కానీ ఈసారి ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఏకంగా ఓ బొద్దింకను ఐసీయులో పెట్టి ఆక్సిజన్ అందించారు. గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న దాన్ని బతికించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ ప్రాంతానికి చెందిన దను లింపపట్టనవానిచ్ అనే యువకుడు రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే.. అతడికి ఓ బొద్దింక కనిపించింది. ఎవరో దాన్ని పొరపాటున తొక్కేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బొద్దింక అక్కడి నుంచి కదల్లేక విలవిల్లాడుతోంది. దాని పరిస్థితి చూసి దను మనసు కరిగిపోయింది. దాన్ని ఎలాగైనా కాపాడాలని దను నిర్ణయించుకున్నాడు. వెంటనే అతడు తన చేతినే అంబులెన్సుగా మార్చేశాడు. ఆ బొద్దింకను తన అరచేతిలో పెట్టుకుని సాయి రాక్ యానిమల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఈ అరుదైన వింత ఘటన గురించి ఆ డాక్టరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. ఆ బొద్దింక బతికేందుకు 50 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని ఆ డాక్టర్ తెలిపాడం జరిగింది.
ఒక మానవత్వం వున్న మనిషిగా ప్రతి జీవి పట్ల కరుణ, జాలి. లోకంలో ప్రతి జీవి జీవితం విలువైనది.ఈ లోకంలో ఇలాంటి వ్యక్తులు మరింత మంది ఉండాలని కోరుకుంటున్నాను.ఈ లోకానికి దయకలిగిన మనుషులు ఎంతో ముఖ్యమని తెలిపాడు. ఆ డాక్టర్ లింపపట్టనవానిచ్ కూడా ఆ బొద్దింకను ఎమర్జెన్సీ పేషెంట్‌గానే భావించాడు. దానికి ఉచితంగా వైద్యం చేస్తానని ‘దను’ కు మాటిచ్చాడు. ఆ బొద్దింక బ్రతికి బయటపడిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాలని అతడికి చెప్పాను. ఇందుకు అతడు అంగీకరించడం జరిగిందని డాక్టర్ తెలిపాడు.