ఇప్పుడు వడాపావ్ ముంబయి మహా నగరానికి పర్యాయపదంలా మారిపోయింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల నుంచి, కాలేజీ విద్యార్థులు, బాలీవుడ్ స్టార్స్ వరకూ దాదాపు నగరంలోని ప్రతి ఒక్కరూ దీనిపై తమకున్న ప్రేమను దాచుకోలేరు. భారత ఆర్థిక రాజధానిలో ప్రతి రోజూ 20 లక్షలకు పైగా కరకరలాడే రుచికరమైన వడా పావ్‌లు ఎంతోమంది కడుపు నింపుతుంటాయి. ముంబైలో వడాపావ్ టేస్టే కానీ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ దుబాయ్ లో చేసిన ఓ వడాపావ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. దుబాయ్ అంటే డబ్బుంటే చాలు స్వర్గ సుఖాలు అనుభవించే భూతల స్వర్గం. అటువంటి దుబాయ్ ల్డ్ బిర్యానీ,గోల్డెన్ బర్గర్లు అందించిన తరువాత..ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి 22 క్యారెట్ల బంగారు వడాపావ్‌ని పరిచయం చేసింది. కరమాలో ఉన్న భారతీయ స్లయిడర్‌లకు సేవలు అందించడంలో ప్రసిద్ధి చెందిన ఓ పావో ‘కాస్ట్లీ’ పావ్‌ని ప్రవేశపెట్టింది. దీని ధర 99 దిర్హామ్ మన కరెన్సీలో సుమారు రూ. 2,000. ట్విట్టర్ లో మసరత్ దౌడ్ ఈ వడాపావ్ ని షేర్ చేయడం జరిగింది.
సాధారణంగా వడాపావ్ ఎంతో రుచిగా చక్కటి మసాలా ఫ్లేవర్స్ తో నూరు ఊరిస్తుంది. ఈ వడాపావ్ ని సాదా సీదాగా చేయడం లేదు. ఏకంగా బంగారం తో తయారు చేస్తున్నారు. నెటిజన్లును ఈ గోల్డెన్ వడాపావ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోని వేల మంది చూశారు. భోజన ప్రియులను ఆకర్షించడానికి రోజుకో ఫుడ్ ఐటమ్ ఫేమస్ అవుతుంది. అందులో పెద్దగా ప్రత్యేకతలు ఏమి లేవు. అందరూ చేసిన విధంగా చేస్తారు. కానీ చేసే విధానంలో మార్పులు కారణంగా అక్కడ ఫుడ్ ఫేమస్. మరి ఇంత కాస్ట్లీ వెరైటీ వడాపావ్ ను సాధారణంగా ప్లేట్ లో పెట్టేసి ఇచ్చేస్తే వాల్యూ ఏంటుంది? అందుకే ప్రజంటేషన్ లో ఏమాత్రం తీసిపోకుండా 22 క్యారెట్ల బంగారం వడాపావ్ రేంజ్ లోనే ప్రజంటేషన్ కూడా ఉంది.
పొగలుకక్కుతున్న ఈ గోల్డెన్ వడాపావ్ ని చిన్న చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. ఈ వడాపావ్ తో పాటు స్వీట్ పొటాటో ఫ్రైస్ మరియు పుదీనా లేమనేడ్ ని ఇస్తారు. ఈ వడాపావ్ మొత్తం ఛీజ్ తో ఫిల్ చేస్తారు. ఫ్రెంచ్ నుండి ఇంపోర్ట్ చేసిన 22 క్యారెట్ గోల్డ్ లీవ్స్ తో ఎంతో అద్భుతంగా దీనిని తయారు చేస్తారు.
#Gold_Vada_Paav This is what’s wrong with the world: too many rebels without a cause. pic.twitter.com/JKeKsgOLEo
— Masarat Daud (@masarat) August 30, 2021