జీవితంలో కొందరికి చివరి ప్రయత్నం వరకు మంచిరోజులు రావు. మరికొందరికి మొదటి ప్రయత్నంలోనే అదృష్టం వరిస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. ఒక్కసారిగా జీవితం మారిపోతుంది. అలాంటి ఘటన ప్రవాస భారతీయుడికి జరిగింది.
ఎవరికైనా జీవితంలో అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. దానిని మనం రిసీవ్ చేసుకోవాలి. అది ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కొందరు పేద కుటుంబంలో జీవించేవారైనా సరే అనుకోకుండా కోటీశ్వరులు అవుతారు. అందుకు తగిన కృషి చేసిన వారుంటారు. మరికొందరికి మొదటి ప్రయత్నంలోనే అదృష్టం వరిస్తుంది. బంపర్ ఆఫర్లు ఎన్ని పెట్టినా అది వరించేది మాత్రం ఒక్కరినే. కొందరు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్స్ కొంటుంటారు. అలాంటిదే భారత ప్రవాసుడికి జరిగింది. దుబాయ్ లో ఉన్న మహ్మద్ అదిల్ ఖాన్ అనే భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. ఇక అతనికి బంగారు భవిష్యత్ కళ్లముందు కనబడుతోంది. ఆ వివరాలేంటో పూర్తిగా తెలుసుకుందాం..
దుబాయ్‌లో నివాసముంటున్న ఇండియన్ మహ్మద్ అదిల్ ఖాన్‌కు ఏకంగా జాక్‌పాట్ తగిలింది. అదిల్ ఖాన్ 33 ఏళ్ల యువకుడు. దుబాయిలో ఐదేళ్ల నుండి ఆర్కిటెక్ట్, ఇంటీరియలర్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. 25 ఏళ్లపాటు ప్రతినెల 25వేల దిర్హమ్స్ వస్తాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5.60 లక్షలు. ‘ఫాస్ట్5 ఎమిరేట్స్ డ్రా’లో అదిల్ ఖాన్ 25 దిర్హమ్స్ తో కొన్న టికెట్‌కు అదృష్టం వరించింది. 25 దిర్హమ్స్ అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 560 అన్నమాట.
ఈ సందర్భంగా అదిల్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఎమిరేట్స్ డ్రాలో పాల్గొన్న మొదటిసారే విజేతగా నిలవడం అనేది మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నాకు ఫోన్ కాల్ నిర్వాహకుల నుండి వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత వారు చెప్పిన వివరాలతో ఒక్కసారిగా ఆనందపడ్డాను. వచ్చే 25 సంవత్సరాలకు నెలవారీ 25వేల దిర్హమ్స్ వస్తాయి. త్వరగా పదవీ విరమణ చేయవచ్చు. ఇక నా భవిష్యత్ సురక్షితం’ అని చెప్పుకొచ్చాడు.