వారు తము ఇరుగు పొరుగున ఉండే ముస్లింల కోసం రంజాన్ సందర్బంగా తమ ఇంట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆ పనుల్లో నిమగ్నమై ఉండగ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో దంపతులు మృతి చెందారు. ఆ వివరాలు..
వారు జీవనోపాధి కోసం కన్నవాళ్లని, సొంత ఊరిని విడిచి విదేశాలకు వెళ్లారు. ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇరుగుపొరుగు వారితో మంచి సంబంధాలు ఉండేవి. తమ ఇంట్లో ఎంత చిన్న ఫంక్షన్ జరిగినా, శుభకార్యం చేసినా ఇరుగుపొరుగు అందరిని పిలిచి.. సంతోషంగా, సరదాగా గడిపేవారు. ఈ క్రమంలోనే రంజాన్ సందర్భంగా తమ చుట్టు పక్కల ఉండే వారి కోసం ఇఫ్తార్ విందు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇంతలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. మరి కాసేపట్లో.. నవ్వులు, కేరింతలతో మారు మోగాల్సిన ప్రాంతం కాస్త.. ఎగసిపడే మంటలు, ఊపిరాడని పొగతో.. శ్మశానంలా మారింది. విందు ఏర్పాట్లలో ఉన్న దంపతులు.. మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
రెండు రోజుల క్రితం దుబాయ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. ఈ 4గురిలో ఇద్దరు కేరళకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కాగా మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన వ్యక్తులు. ఇక శనివారం మధ్యాహ్నం అల్-రాస్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్, నాలుగో అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో సజీద దహనం అయిన వారిలో కేరళ, మలప్పురం దంపతులు రాజేష్, జేషీలు ఉన్నారు. ట్రావెల్ అండ్ టూరిజమ్ కంపెనీలో రాజేష్.. బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తుండగా.. జేషీ.. స్థానికంగా ఉన్న పాఠశాలలో స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో వీరు కేరళ నూతన సంవత్సరాది విషు సందర్భంగా అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముస్లింలను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇంతలో అపార్ట్‌మెంట్ 4వ అంతస్తులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. అవి రాజేష్-జేషీలు ఉండే ఫ్లాట్ వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో రాజేష్-జేషీలు సజీదహనం అయ్యారు. మరి కాసేపట్లో ఇఫ్తార్ విందుకు వచ్చే వారితో సందడిగా ఉండాల్సిన ప్రాంగణం.. శ్మశానంలా మారింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. వీరికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తోన్నారు.
ఇక రాజేష్-జేషీలను తలచుకుని.. ఇరుగుపొరుగు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ‘‘రాజేష్-జేషీలు తమ ఇంట్లో ఏ పండుగ జరిగినా, ఫంక్షన్ చేసినా మమ్మల్ని తప్పకుండా ఆహ్వానించేవారు. ఇరుగుపొరుగు వారితో చక్కగా కలిసిపోయేవారు. మాకు ఏ సాయం కావాలన్నా చేసేవారు. ప్రస్తుతం కేరళ సంవత్సరాది, రంజాన్ సందర్భంగా మాకోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాడు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంత మంచి వాళ్లను కోల్పోవడం దురదృష్టం’’ అన్నారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ బృందం అక్కడకు చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టింది. అపార్ట్‌మెంట్‌ను నిర్మించిన నిర్మాణ సంస్థ నింబంధనలను ఉల్లంఘించడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. మృతదేహాలను భారత్‌కు పంపేందుకు సహకరిస్తామని రాయబార కార్యాలయం ప్రకటించింది. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.