దుబాయ్‌లోని ఒక రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
అగ్ని ప్రమాద ఘటనలు ఈమధ్య ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వ్యాపార సముదాయాలతో పాటు నివాస భవనాల్లోనూ ఈ తరహా ఘటనలు అధికంగా జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. సరైన ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యలేమి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక నివాస భవనంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు ఇండియన్స్ సహా 16 మంది చనిపోయారు. మరో 9 మంది గాయాలపాలయ్యారు. దుబాయ్‌లోని దీరా బుర్జ్ మురార్ ప్రాంతంలో రెసిడెన్షియల్ బిల్డింగ్‌లోని ఒక అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది.
బిల్డింగ్ నాలుగో అంతస్తులో మొదలైన మంటలు క్షణాల్లోనే అంతటా వ్యాపించాయి. దీరా బుర్జ్ మురార్లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో కేరళ, తమిళనాడుకు చెందిన వారు ఇద్దరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో కేరళ, తమిళనాడుకు చెందిన వ్యక్తులతో పాటు పాకిస్థాన్, నైజీరియాకు చెందిన వారు సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారని దుబాయ్ అధికారులు తెలిపారు. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపి మృతదేహాలను ఇండియాకు పంపేందుకు సహకరిస్తామని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Sixteen dead, 9 injured in Dubai residential building fire https://t.co/gEKOlhjayd pic.twitter.com/s6WwzmvXeZ
— Reuters (@Reuters) April 16, 2023