ప్రపంచంలో ఈ మద్య కాలంలో ఎక్కడ చూసినా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్ళు అక్రమంగా ఆయుధాలను అమ్మడంతో చిన్న చిన్న నేరగాళ్లు సైతం గన్ వాడటం కామన్ అయ్యింది. చాలా మంది గన్ లైసెన్స్ లేకుండానే కాల్పులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో గన్ కల్చర్ బుసలు కొడుతుంది. రద్దీగా ఉండే ప్రదేశాలైన హూటల్స్, క్లబ్స్, స్కూల్స్, ప్రార్థనా మందిరాల్లో కొంత మంది ఉన్మాదులు కాల్పులకు తెగబడటంతో పదుల సంఖ్యలో అమాయకులు చనిపోతున్నారు.
ఇటీవల అమెరికాలో గన్ కల్చర్ దారుణంగా పెరిగిపోయింది. మైనర్లు కూడా గన్స్ తో రెచ్చిపోయి ఎక్కడబడితే అక్కడ కాల్పులు జరపడంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరాడోలో ప్రాంతంలో ఉన్న ఒక గే నైట్ క్లబ్ లో ఉన్మాది చెలరేగిపోయాడు.. గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఉన్మాది కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకొని సాయుధుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కాల్పులకు గల కారణం మాత్రం తెలియరాలేదు. ట్రాన్స్ ఫోబియా కారణంగా చనిపోయిన వారి జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం నవంబర్ 20 న కొంతమంది ఓ ప్రత్యేక వేడుక జరుపుకుంటారు.. ఆ సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
DEVELOPING: Multiple people injured following reported shooting at gay nightclub in Colorado Springs, Colorado; massive police response underway
pic.twitter.com/NuJlPKF1Od— Intel Point ALERT (@IntelPointAlert) November 20, 2022