పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారా? ఫోన్ లో పాస్ వర్డ్ తెలుసుకుని మరీ వీడియోగేమ్స్ ఆడుతున్నారా? అలా అయితే ఈ సంగతి తెలియాల్సిందే. నార్త్ వేల్స్‌కి చెందిన ఏడేళ్ల బాలుడు అషాజ్ తన తండ్రి ఐఫోన్లో డ్రాగన్స్ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోతుండగా మధ్య వచ్చిన యాప్ యాడ్స్‌ను క్లిక్ చేసుకుంటూ పోయాడు. గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి వంద పౌండ్ల విలువ చేసే యాప్స్ కొన్నింటిని కొనుక్కుంటూ పోయాడు. ఆ మొత్తం ఎమౌంట్ 1,289 పౌండ్లకు చేరింది. ఈ-మెయిల్స్ ద్వారా యాపిల్ కంపెనీ నుంచి బిల్లులు జనరేట్ అయిన విషయం గుర్తించిన ఆ పిల్లాడి తండ్రి ముహమ్మద్ ముతాజా షాక్ తిన్నాడు. కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అయిన ముతాజా అంత స్తోమత లేకపోవడంతో కారును అమ్మేసుకున్నాడు.
ఆషాజ్కు ఫోన్ పాస్ వర్డ్ తెలిసినప్పటికీ ఆటలో అపరిమిత కొనుగోలు వ్యవహారంపై రచ్చ మొదలైంది. నిజానికి అది ఫ్రీ వెర్షన్ గేమ్. నాలుగేళ్లు పైబడిన పిల్లలు ఎవరైనా ఆడోచ్చు. కానీ, అంతేసి అమౌంట్ యాప్‌ల కొనుగోలు యాడ్లను ఇవ్వడంపై ముతాజా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొనుగోళ్లను అందులో పెద్ద మొత్తం ఎమౌంట్తో అనుమతించడం పెద్ద మోసమని పెద్ద స్కామ్‌గా భావిస్తూ యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేశాడు. ఊరటగా 207 పౌండ్లు వెనక్కి వచ్చాయి. పిల్లల గేమ్‌ల్లో పరిమితులు లేని కొనుగోళ్ల వ్యవహారంపై ఆయన కోర్టును ఆశ్రయించాడు.