దేశ వ్యాప్తంగా విదేశీ యాపిల్స్‌కు మంచి గిరాకీ ఉంది. తక్కువ ధరకు యాపిల్స్ అందుబాటులో ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా ఈ యాపిల్స్ కొనడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజు ఓ యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరక వెళ్లే అవసరం ఉండదని పెద్దలు అంటూ ఉంటారు. యాపిల్స్‌లో ఉండే పోషక విలువుల కారణంగా మన శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు. అందుకే మార్కెట్లో యాపిల్స్‌కు మంచి డిమాండ్ ఉంది. సీజన్‌తో సంబంధం లేకుండా యాపిల్స్ మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. అయితే, దేశంలో పండించే యాపిల్స్ కంటే విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్‌నే దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే.. విదేశాలనుంచి వచ్చే యాపిల్స్ తక్కువ ధరకు రావటమే దీనికి కారణం.
దీంతో దేశంలో యాపిల్స్‌ను పండించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్కెట్లో వీరి పండ్లకంటే.. దిగుమతి చేసుకున్న పండ్లకే డిమాండ్ ఉంటోంది. ఈ కారణంగా దేశీయంగా యాపిల్స్ పండిస్తున్న వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దేశీయ యాపిల్ రైతులకు శుభవార్త చెప్పింది. దిగుమతి చేసుకుంటున్న విదేశీ యాపిల్స్‌పై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకోవటంపై నిషేదం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
నిషేధం ఉన్న దేశాల్లో భూటాన్‌కు మినహాయింపు లభించింది. సీఐఎఫ్ ధర కిలో 50 రూపాయల కంటే తక్కువ ఉన్నా.. భూటాన్‌నుంచి యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికా, పోలాండ్, ఇరాన్, అమెరికా, బ్రెజిల్, చిలీ, ఇటలీ, టర్కీ, యూఏఈ, అఫ్ఘానిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, న్యూజిలాండ్ దేశాలపై ఈ నిషేదం ఉంది. మరి, విదేశీ యాపిల్స్‌ను దేశంలోకి దిగుమతి చేసుకోవటంపై భారత ప్రభుత్వం నిషేదం విధించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.