దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచం మెచ్చిన ఐఫోన్ల తయారీని ఈ కంపెనీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
మార్కెట్లో ఎన్ని రకాల మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినా పాపులారిటీలో ఐఫోన్ కిందకే వస్తాయి. రోజురోజుకీ ఐఫోన్లకు క్రేజ్ పెరుగుతోందే గానీ తగ్గడం లేదు. ధర కూడా లక్షకు పైనే ఉన్నా దాన్ని కొనేందుకు వినియోగదారులు వెనక్కి తగ్గడం లేదు. ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్‌లా మారిపోయింది. అలాంటి ఐఫోన్లను భారత్‌కు పొరుగున ఉన్న చైనాలో తయారు చేసేవారు. అయితే ఇండియాలో తమ ప్రొడక్షన్‌ను మొదలుపెట్టాలని యాపిల్ సంస్థ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన దిగ్గజ సంస్థ టాటా గ్రూప్‌తో యాపిల్ జట్టు కట్టింది. ఐఫోన్ల తయారీలో భాగస్వామ్యం కావాలని టాటాలను యాపిల్ కోరిందట. దీనికి అటు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందట. ఐఫోన్ల తయారీని టాటా గ్రూప్ మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి. బెంగళూరుకు దగ్గర్లోని ఒక ఫెసిలిటీలో ఐఫోన్ల తయారీని ప్రారంభించారట.
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్ సంస్థ అయిన విస్ట్రాన్ ప్లాంట్ నర్సాపురకు సమీపంలో ఉంది. ఇక్కడే ఐఫోన్ల తయారీని టాటా గ్రూప్ మొదలుపెట్టిందని ఒక జాతీయ వార్తా సంస్థ నివేదించింది. ఈ విస్ట్రాన్ ప్లాంట్‌ను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోందని సమాచారం. ఇకపోతే, విస్ట్రాన్ కంపెనీ పూర్తిగా యాపిల్ ప్రొడక్ట్స్ తయారీ నుంచి నిష్క్రమించాలని డిసైడ్ అయిందట. భారత్‌లోని నాన్ యాపిల్ ప్రొడక్ట్స్ మార్కెట్ మీద ఆ కంపెనీ దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. కాగా, ఇటీవల ముంబైలో ఒకటి, ఢిల్లీలో ఒకటి చొప్పున యాపిల్ స్టోర్లు మొదలయ్యాయి. ఆ సమయంలోనే కంపెనీ సీఈవో టిమ్ కుక్, టాటా ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఇప్పుడీ రిపోర్ట్ రావడం గమనార్హం. ఐఫోన్ల తయారీ భారత్‌లో మరింత వేగం పుంజుకుంటే చైనాకు ఇబ్బందులు తప్పవు. మిగిలిన దిగ్గజ కంపెనీలు కూడా భారత్ వైపు తమ దృష్టిని సారిస్తాయి.
#Tatas get a bite of #Apple, start manufacturing #iPhone in #Bengaluru
In an ambitious manufacturing move in India, the Tata Group has started making the Apple iPhone within the country, multiple sources have told TOI.https://t.co/J72R9ruE6A pic.twitter.com/Dh7a0t1cW4
— The Times Of India (@timesofindia) May 16, 2023