Drunk Woman : మద్యం మత్తులో ఓ మహిళ చేసిన తప్పు పచ్చబొట్టు రూపంలో వెంటాడుతోంది. అసలు ఎవరో తెలియని వ్యక్తి పేరును పచ్చ బొట్టుగా పొడిపించుకుని ప్రశ్చాత్తాప పడుతోంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని హియర్ ఫోర్డ్‌కు చెందిన కైలీ విలియమ్స్ 2012లో ఫ్రెండ్స్‌తో కలిసి స్పేయిన్‌లోని మగలఫ్‌కు టూర్‌కు వెళ్లింది. ఓ రోజు అక్కడి ఓ బార్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్‌గా మందు తాగింది. బార్‌నుంచి బయటకు వచ్చి మద్యం మత్తులో అటూఇటూ తిరుగుతూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ ట్యాటూ సెంటర్ ముందుకు వచ్చి నిలబడ్డారు. అక్కడ కొంతమంది స్పానిష్ పిల్లలు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిలోంచి ఓ బాలుడు కైలీ దగ్గరకు వచ్చాడు. తన పేరును పచ్చబొట్టుగా వేయించుకోమని ఆమెను బ్రతిమాలాడు.
అందుకు డబ్బులు కూడా తానే ఇస్తానని అన్నాడు. మొదట కుదరదు అన్నా.. తర్వాత ఒప్పుకుందామె. అతడి పేరును ఆమె టాటూగా వేయించుకుంది. బాలుడు డబ్బులు కట్టేశాడు. అక్కడినుంచి ఇళ్లకు వచ్చేశారు. ఉదయం లేచిన తర్వాత తన పిరుదుపై ‘‘ డేనియల్ ఫోర్డ్’ అని పేరు రాసి ఉండటం చూసి షాక్ అయింది. ఈ సంఘటన జరిగి దాదాపు 10 ఏళ్లు అయింది. ఆ పేరు ఎవరిదో, తను అంత పిచ్చిగా అలా ట్యాటూ ఎందుకు వేయించుకుందో ఇప్పటికీ షాక్‌లోనే ఉంది కైలీ. సోషల్ మీడియా ద్వారా అతడు ఎవరో తెలుసుకుందామని చూసింది. కానీ, కుదరలేదు. తను చేసిన పిచ్చి పనికీ ఇప్పటికీ బాధపడుతోంది. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే నంటూ చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మహిళకు డేంజరస్ ఫీవర్.. వచ్చిందంటే కళ్లలోంచి రక్తం వచ్చి ఛస్తారు!!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.